స్వీటీ అనుష్క‌కు వింత జబ్బు.. నవ్వితే ప్యాక‌ప్ చెప్పేయాల్సిందే!

విధాత‌: ఒక్కొక్కరిది ఒక్కో జబ్బు. ఇటీవల చాలామంది సెలబ్రిటీలు క్యాన్సర్ బారిన పడ్డారు. క్యాన్సర్‌ను జయించి మరల పునర్జన్మ పొందారు. ఇక సమంత వంటివారు మయోసైటిస్‌తో పాటు పలు వ్యాధులు ఎదుర్కొంటున్నారు. రేణు దేశాయ్ ఇటీవల తాను అనారోగ్య సమస్యతో బాధ పడుతున్నానని వెల్లడించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. బిగ్‌ బి అమితాబ్ కూడా టీబీతో బాధ పడుతున్నారు. విష‌యానికి వ‌స్తే తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అనుష్క శెట్టి […]

స్వీటీ అనుష్క‌కు వింత జబ్బు.. నవ్వితే ప్యాక‌ప్ చెప్పేయాల్సిందే!

విధాత‌: ఒక్కొక్కరిది ఒక్కో జబ్బు. ఇటీవల చాలామంది సెలబ్రిటీలు క్యాన్సర్ బారిన పడ్డారు. క్యాన్సర్‌ను జయించి మరల పునర్జన్మ పొందారు. ఇక సమంత వంటివారు మయోసైటిస్‌తో పాటు పలు వ్యాధులు ఎదుర్కొంటున్నారు. రేణు దేశాయ్ ఇటీవల తాను అనారోగ్య సమస్యతో బాధ పడుతున్నానని వెల్లడించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. బిగ్‌ బి అమితాబ్ కూడా టీబీతో బాధ పడుతున్నారు.

విష‌యానికి వ‌స్తే తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అనుష్క శెట్టి ఈ మధ్య చాలా సెలెక్టివ్‌గా చిత్రాలు చేస్తోంది. అరుంధతి, రుద్రమదేవి, భాగమతి వంటి పలు చిత్రాలు ఆమె స్థానాన్ని పదిలం చేశాయి. ఇక బాహుబలితో ఈమెకు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. అయితే ఆ ఇమేజ్‌ని క్యాష్ చేసుకోవాలని అనుష్క ప్రయత్నించలేదు.

జాడ‌లేని అనుష్క‌..

బాహుబలి తర్వాత అనుష్క భాగమతి, నిశ్శబ్దం వంటి చిత్రాల్లో నటించింది. నిశ్శ‌బ్దం చిత్రం ఓటీటీలో విడుద‌లైంది. అంతే.. అప్పటి నుంచి అనుష్క జాడే లేదు. లాక్ డౌన్‌లో మళ్ళీ బరువు పెరిగింది. అందువల్ల సినిమాలు డిలే అవుతున్నాయి. ప్రస్తుతం అనుష్క జాతి రత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి హీరోగా ఓ సినిమా చేస్తోంది.

ఈ మూవీకి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే టైటిల్‌ని అనుకుంటున్నారు. ఇందులో అనుష్క చెఫ్‌గా న‌టిస్తోంది. ఈ విషయం ఇటీవల వచ్చిన ఫస్ట్ లుక్‌లోనే తెలియ‌జేశారు. కాగా అనుష్క ఓ వింత వ్యాధితో బాధ పడుతోందనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి. అనుష్కకి నవ్వు వస్తే.. తట్టుకోవడం కష్టమట. ఇదేం వింత జబ్బు అనుకుంటున్నారా?

విచిత్ర స‌మ‌స్య‌..

బహుశా ఆమె యోగా టీచర్ కావడం వల్ల లాఫింగ్ క్లబ్బులు కొంతకాలం నడిపి ఉంటుంది కాబోలు. ఈ సమస్య ఆ లాఫింగ్ క్లబ్‌లోకి సంబంధించినది. ఆమెకు ఈ సమస్య వస్తే షూటింగ్‌లో సైతం ఓ 15, 20 నిమిషాల పాటు షూటింగ్ ఆపేయాల్సిందేనట. అనుష్కకి ఈ నవ్వు ఆపుకోలేని విచిత్ర సమస్య ఎలా వచ్చి ఉంటుందా? అని ఆమె ఫ్యాన్స్ అంతా కంగారు పడుతుండటం విశేషం. ఆమెకున్న ఈ వింత జబ్బు గురించి స్వయంగా అనుష్కే చెప్పుకొచ్చింది.

ప్యాక‌ప్ చెప్పాయాల్సిందే..

ఆ సమయంలో యూనిట్ టీ, స్నాక్స్ తినడంతో సరిపోతుందని చెప్పుకొచ్చింది. ఆమెకు నవ్వు వచ్చిందంటే ప్యాకప్ చెప్పేయాల్సిందే. మ‌రి ఈ వింత వ్యాధికి కార‌ణం ఏమిటో మాన‌సిక వైద్యుడిని సంప్ర‌దిస్తే గానీ తెలియ‌దు. కాగా ఇప్పుడు అనుష్క వయసు 41. ఆమె దాదాపు 18 ఏళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో వెలుగొందుతోంది. సూపర్ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇంకా ఆమె పెళ్లి చేసుకోలేదు.