ఉచిత కోచింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలి: అమిత్ రెడ్డి
విధాత: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ అందిస్తున్న ఉచిత కోచింగ్ ను సద్వినియోగం చేసుకోవాలని ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సూచించారు. ట్రస్టు కోచింగ్ సెంటర్లలో ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ ఫోర్త్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులకు నల్గొండ టీఎన్జీవోఎస్ భవన్ ప్రకాశం బజార్‌లో ఫిబ్రవరి 2వ తేదీ నుండి ఉచిత కోచింగ్‌తో పాటు మధ్యాహ్నo భోజనం కూడా అందిస్తున్నారు. శనివారం కోచింగ్ సెంటర్ ను సందర్శించిన అమిత్ రెడ్డి […]

విధాత: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ అందిస్తున్న ఉచిత కోచింగ్ ను సద్వినియోగం చేసుకోవాలని ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సూచించారు. ట్రస్టు కోచింగ్ సెంటర్లలో ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ ఫోర్త్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులకు నల్గొండ టీఎన్జీవోఎస్ భవన్ ప్రకాశం బజార్‌లో ఫిబ్రవరి 2వ తేదీ నుండి ఉచిత కోచింగ్‌తో పాటు మధ్యాహ్నo భోజనం కూడా అందిస్తున్నారు.
శనివారం కోచింగ్ సెంటర్ ను సందర్శించిన అమిత్ రెడ్డి అభ్యర్థులతో కలిసి భోజనం చేసి కోచింగ్ సాగుతున్న తీరును సమీక్షించారు. 15 సంవత్సరాల అనుభవము కలిగిన అధ్యాపకులచే నిర్వహిస్తున్న ఉచిత కోచింగ్ కార్యక్రమం సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడాలని కోరుకున్నారు. ప్రణాళికాయుతంగా చదివి పోటీ పరీక్షల్లో నెగ్గాలని సూచించారు. అనంతరం 63వ బాపిస్ట్ మహిళ అసోసియేషన్ ఉమెన్స్ మీట్‌లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమములో బీఆర్ఎస్ పట్టణ మహిళ అధ్యక్షురాలు దుబ్బ రూప అశోక్ సుందర్, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు వనమా వెంకటేశ్వర్లు, విజిలెన్స్ &మానిటరింగ్ సభ్యులు అయితగాని స్వామి గౌడ్ ,తెలంగాణ హజ్ కమిటీ మెంబర్ బషీరుద్దిన్, పార్టీ మైనార్టీ నాయకులు హాన్ను తదితరులు పాల్గొన్నారు.