మళ్లీ వార్తల్లో.. శింబు పెళ్లి! ఈసారైనా జరిగేనా.. ఉత్తదయ్యేనా
విధాత, సినిమా: ఇప్పటికే ముగ్గురితో లవ్, పెళ్లి అంటూ హడావుడి చేసిన శింబు. ఇప్పుడు మరో అమ్మాయిని పటాయించాడు. చూస్తుంటే హీరో శింబుకి ఎక్కడో సుడి ఉందని అనిపిస్తుంది. ఒక అమ్మాయితో బ్రేకప్ కాగానే మరో అమ్మాయి సిద్ధంగా ఉంటుంది. అధికారికంగా ఆయన ఇప్పటివరకు ముగ్గురు హీరోయిన్స్‌తో ఎఫైర్ నడిపాడు. ప్రస్తుతం ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లుగా తాజాగా విషయం బయటికి వచ్చింది. అంతేకాదు ఆమెను వివాహం కూడా చేసుకోబోతున్నాడట. ఇంతకీ ఆ భామ ఎవరా అంటూ […]

విధాత, సినిమా: ఇప్పటికే ముగ్గురితో లవ్, పెళ్లి అంటూ హడావుడి చేసిన శింబు. ఇప్పుడు మరో అమ్మాయిని పటాయించాడు. చూస్తుంటే హీరో శింబుకి ఎక్కడో సుడి ఉందని అనిపిస్తుంది. ఒక అమ్మాయితో బ్రేకప్ కాగానే మరో అమ్మాయి సిద్ధంగా ఉంటుంది.
అధికారికంగా ఆయన ఇప్పటివరకు ముగ్గురు హీరోయిన్స్‌తో ఎఫైర్ నడిపాడు. ప్రస్తుతం ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లుగా తాజాగా విషయం బయటికి వచ్చింది. అంతేకాదు ఆమెను వివాహం కూడా చేసుకోబోతున్నాడట. ఇంతకీ ఆ భామ ఎవరా అంటూ అంతా గుసగుసలాడుకుంటున్నారు?
శ్రీలంకకి చెందిన బడా వ్యాపారవేత్త కూతుకు శింబుకి వీరాభిమాని. ఒకసారి శింబుని కలవడం, వీరి మధ్య ఫోన్ నెంబర్ ఎక్సేంజ్ జరిగిందట. అలా పెరుగుతూ వచ్చిన పరిచయం ప్రేమకు దారి తీసిందని ఇప్పుడు ఇద్దరూ పెళ్ళికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.
ఈ పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు కూడా అంగీకారం తెలిపారట. త్వరలోనే వీరి పెళ్ళంటున్నారు. అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వీరి వార్త హల్చల్ చేస్తుంది. కోలీవుడ్ మీడియాలో ఈ వార్త దుమారం రేపుతుంది. మరికొంతమంది ఇది ఫేక్ న్యూస్ అని కొట్టి పారేస్తున్నారు.
శింబు గతంలో నయనతార, హన్సిక, త్రిషలతో ప్రేమాయణం నడిపాడు. సీరియస్‌గా వారితో ప్రేమ కథలు కొనసాగించాడు. నయనతార పరిశ్రమకు వచ్చిన కొత్తలోనే ఆమెను బుట్టలో వేసుకున్నాడు. వీరి గాడమైన ప్రేమ తెలియజేస్తూ ప్రవేట్ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అధర చుంబునాలతో రెచ్చిపోయారు. నయనతార, శింబు పెళ్లి చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
#NewsUpdate | சிம்புவுக்கு இலங்கை பெண்ணுடன் திருமணமா? உண்மை என்ன? https://t.co/KzX7g97U6t#Silambarasan #Marriage #சிம்பு #SrilankanGirl #FilmibeatTamil @SilambarasanTR_ pic.twitter.com/YBXGuJgxI5
— Tamil Filmibeat (@FilmibeatTa) February 25, 2023
అలాగే తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైన హన్సిక.. కోలీవుడ్‌కి వెళ్లిన తర్వాత శింబుతో లిప్‌లాక్‌లతో సంచలనం సృష్టించింది. తర్వాత వీరిద్దరి పెళ్లి.. పీటల వరకు వెళ్లి ఆగిపోయింది. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. మధ్యలో త్రిష కూడా శింబు విషయంలో హడావుడి చేసింది. కానీ కార్యరూపం దాల్చలేదు.
చావరకు శింబుతో ప్రేయాయణం నడిపించిన నయనతార ఆ తర్వాత మరో రెండు వ్రేమ వ్యవహారాలు నడిపి చివరకు విఘ్నేశ్ శివన్‌ను పెళ్లి చేసుకుని సెటిలవ్వగా, హన్షిక ఇటీవలే తన చిన్ననాటి మిత్రుని పెళ్లి చేసుకుంది. త్రిష ఓ వ్యాపారవేత్తతో ఎంగేజ్‌మెంట్ చేసుకుని మరి క్యాన్షిల్ చేసుకోగా శింబు మాత్రం బ్యాచ్‌లర్‌గానే ఉంటూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నాడు.
ఇటీవల మరోసారి తెలుగు నుంచే వెళ్లిన నిధి ఆగర్వాల్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు బాగా వచ్చాయి. కానీ ఈ సారి ప్రేమించిన అమ్మాయితో పెళ్లిపీటలు ఎక్కేందుకు శింబు సిద్ధమయ్యాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఈసారైనా శింబు పెళ్లికి శివుడాజ్ఞ ఇచ్చాడో లేదో.. తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.