TDP | ‘కోడెల’ ఫ్యామిలీ క్లోజ్ అయినట్లేనా.. సత్తెనపల్లి ఇన్‌చార్జిగా ‘కన్నా’

TDP విధాత‌: గుంటూరు రాజకీయాల్లో కోడెల శివప్రసాద్‌ది సుస్థిరమైన స్థానం. నర్సరావుపేట, సత్తెనపల్లి ఎమ్మెల్యేగా.. హోమ్, వైద్య మంత్రిగా, స్పీకర్ గా అయన పార్టీలో కీలక పాత్ర పోషించారు.. కానీ ఇప్పుడు అయన ఫ్యామిలీ టిడిపికి దూరం అయినట్లే.. మారుతున్న పరిణామాల్లో ఆ కుటుంబానికి టికెట్ లేదని చంద్రబాబు చెప్పకనే చెప్పేసారు. సత్తనెపల్లి ఇన్‌చార్జిగా కన్నా లక్ష్మీనారాయణను నియమించి, కోడెల ఫ్యామిలీకి మొహం మీద తలుపు వేసేసారు. వాస్తవానికి చంద్రబాబు కోడెల శివప్రసాద్ అంటే అపారమైన ప్రేమ […]

TDP | ‘కోడెల’ ఫ్యామిలీ క్లోజ్ అయినట్లేనా.. సత్తెనపల్లి ఇన్‌చార్జిగా ‘కన్నా’

TDP

విధాత‌: గుంటూరు రాజకీయాల్లో కోడెల శివప్రసాద్‌ది సుస్థిరమైన స్థానం. నర్సరావుపేట, సత్తెనపల్లి ఎమ్మెల్యేగా.. హోమ్, వైద్య మంత్రిగా, స్పీకర్ గా అయన పార్టీలో కీలక పాత్ర పోషించారు.. కానీ ఇప్పుడు అయన ఫ్యామిలీ టిడిపికి దూరం అయినట్లే.. మారుతున్న పరిణామాల్లో ఆ కుటుంబానికి టికెట్ లేదని చంద్రబాబు చెప్పకనే చెప్పేసారు. సత్తనెపల్లి ఇన్‌చార్జిగా కన్నా లక్ష్మీనారాయణను నియమించి, కోడెల ఫ్యామిలీకి మొహం మీద తలుపు వేసేసారు.

వాస్తవానికి చంద్రబాబు కోడెల శివప్రసాద్ అంటే అపారమైన ప్రేమ చూపిస్తారు. అయితే టిడిపి ప్రభుత్వం దిగిపోయిన కొన్నాళ్ళకు కోడెల శివప్రసాద్ తన పిల్లలు చేసిన అరాచకాలకు బాధ్యత వహించవలసి వచ్చింది. వాస్తవానికి ఆయన్ను ఇనుమేట్ల గ్రామంలో పోలింగ్ రోజున ప్రజలు తరిమి కొట్టడం, ఇంతా దెబ్బలు కాసినా అయన ఎన్నికల్లో ఓడిపోవడం తెలిసిందే.

ఆఖరుకు ప్రభుత్వ ఆఫీస్ కుర్చీలు సైతం అయన కుమారుడు శివరామ ఎత్తుకురావడమే కాకుండా సత్తెనపల్లిలో వీధి వ్యాపారుల నుంచి సైతం మామూళ్లు వసూళ్లు చేసిన అరాచకాలు.. తరువాత ఆయన కేసులు ఎదుర్కొని అవమానాలు పాలై చివరకు ఆత్మ హత్య చేసుకున్న విషయం తెలిసిందే.

అయితే అయన చనిపోయాక అది ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపణలు చేసి అయన పార్థివ దేహాన్ని హైదరాబాద్ పార్టీ ఆఫీసులో ఒకరోజు.. మంగళగిరి పార్టీ ఆఫీసులో ఒకరోజు.. నరసరావుపేట లో ఒక రోజు ఇలా 3 రోజులు ఆయన శవంతో రాజకీయం చేసారు చంద్రబాబు.

ఆ తరువాత శివరాంను ఓదార్చి నీ పొలిటికల్ కెరీర్ నేను చూసుకుంటాను అని హామీ ఇచ్చారు. ఇక అక్కడ మళ్ళీ తమ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఎవరూ లేకపోవడం, శివరాంను గానీ పోటీ చేస్తే ఇనుమెట్ల సీన్ మళ్ళీ రిపీట్ అవుద్దని భయం ఇవన్నీ కలగలిసి ఆ తరువాత శివరాం ను కనీసం ఎపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా దూరం పెట్టారు.

తాజాగా సత్తెనపల్లి ఇన్‌చార్జిగా కన్నా లక్ష్మీనారాయణను నియమించి శివరాం రాజకీయ భవిష్యత్ కు మంగళం పాడేసారు. అంటే కోడెలను వాడుకున్నారు.. ఆయన చనిపోయాక ఆయన కుటుంబానికి కెరీర్ క్లోజ్ చేసేసారు..