ఎగురుతున్న పిట్టకు మసాలా.. టీడీపీ నేతల పదవుల పంపకం!

విధాత: ఎగురుతున్న పిట్టకు మసాలా నూరడం అంటే ఇదే.. అసలు రాజకీయ పొత్తులే ఖరారు కాలేదు.. ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో తెలీదు. ఎవరు గెలుస్తారో.. ఎవరు లేదో తెలీదు.. అయినా గానీ టీడీపీలో ఇప్పటికే పదవులు పంచేసుకుంటున్నారట.. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినట్లు, తాము అధికారంలోకి వచ్చేసినట్లు ఆల్రెడీ ఊహల్లో తేలిపోతున్న టీడీపీ నేతలు ఇప్పటినుంచే ప్రమాణ స్వీకారం ప్రాక్టీస్ చేస్తున్నారట. ఎవరెవరికి ఏయే శాఖలు ఇస్తారో కూడా ఆల్రెడీ లెక్కలు వేసుకుంటున్నారట.. జనసేనతో పొత్తు […]

  • By: krs    latest    Nov 08, 2022 1:11 PM IST
ఎగురుతున్న పిట్టకు మసాలా.. టీడీపీ నేతల పదవుల పంపకం!

విధాత: ఎగురుతున్న పిట్టకు మసాలా నూరడం అంటే ఇదే.. అసలు రాజకీయ పొత్తులే ఖరారు కాలేదు.. ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో తెలీదు. ఎవరు గెలుస్తారో.. ఎవరు లేదో తెలీదు.. అయినా గానీ టీడీపీలో ఇప్పటికే పదవులు పంచేసుకుంటున్నారట.. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినట్లు, తాము అధికారంలోకి వచ్చేసినట్లు ఆల్రెడీ ఊహల్లో తేలిపోతున్న టీడీపీ నేతలు ఇప్పటినుంచే ప్రమాణ స్వీకారం ప్రాక్టీస్ చేస్తున్నారట.

ఎవరెవరికి ఏయే శాఖలు ఇస్తారో కూడా ఆల్రెడీ లెక్కలు వేసుకుంటున్నారట.. జనసేనతో పొత్తు ఉన్నా లేకున్నా గెలుపు తమదేనని టీడీపీ భావిస్తోంది. దీంతో రేపు చంద్రబాబు అధికారంలోకి రావడం గ్యారెంటీ అని నమ్మకంతో ఉన్న టీడీపీ నేతలు ఇప్పుడే శాఖలు కూడా కేటాయించేసుకుంటున్నారట.

ప్రస్తుత ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు మంత్రి పదవి ఖాయమైందట.. ఈసారి తాను హోం మంత్రిగా ఉంటానని ఆయనే చెప్పుకుంటున్నారట. వైసీపీ హయాంలో కేసుల పాలై బాగా ఇబ్బందులు పడిన అచ్చెన్న హోంమంత్రిగా ఉంటారట. బహుశా ఈసారి ప్రత్యర్థుల మీద ప్రతీకారం తీర్చుకుంటారు కావచ్చు.

ఎక్కడి నుంచి పోటీ చేస్తారో.. గెలుస్తారో లేదో ఇంకా తెలీని లోకేష్ ఈసారి కూడా ఐటీ పరిశ్రమ శాఖలే తీసుకుంటారట. యనమల రామకృష్ణుడుకు వ్యవసాయం కావాలట. ఇక టీవీ ఛానెళ్లలో వైసీపీ మీద విరుచుకు పడుతున్న మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అనితకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఇస్తారట. వాస్తవానికి ఆమెకు పాయకరవుపేటలో ఎమ్మెల్యే టికెట్ దక్కే ఛాన్స్ లేదని అంటున్నారు కానీ మంత్రి పదవి మాత్రం ఖాయం చేసుకున్నారు.

అశోక్ గజపతి.. పరిటాల శ్రీరామ్.. దేవినేని ఉమ.. గౌతు శిరీష.. పత్తిపాటి పుల్లారావు.. పయ్యావుల కేశవ్ సోమిరెడ్డి చంద్రమోహన్ ఇలా సీనియర్ నాయకులంతా కలల కేబినెట్లో మంత్రులు అయిపోయారు. నిజంగా గెలుస్తారో లేదుగానీ ఇప్పటికైతే ఊహల్లో తెలిపోతున్నారు.