విద్యార్థుల ముందే బీర్లు తాగిన టీచర్.. వీడియో వైరల్
విధాత: విద్యాబుద్ధులు నేర్పుతూ.. విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సిన టీచర్.. పాడుపనికి పాల్పడ్డాడు. తరగతి గదిలోనే విద్యార్థుల ముందు బీర్లు తాగుతూ కనిపించాడు ఆ టీచర్. ఓ రెండు బీర్ బాటిల్స్ అతని వద్ద ఉన్నట్లు వీడియోలో కనిపించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్‌లో వెలుగు చూసింది. తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తూనే.. టీచర్ బీర్లు తాగాడు. ఒక బీర్ క్యాన్ అయిపోవడంతో తన కాళ్ల వద్ద ఉంచాడు. మరో బీర్ బాటిల్‌ను తాను కూర్చొన్న కుర్చీ […]

విధాత: విద్యాబుద్ధులు నేర్పుతూ.. విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సిన టీచర్.. పాడుపనికి పాల్పడ్డాడు. తరగతి గదిలోనే విద్యార్థుల ముందు బీర్లు తాగుతూ కనిపించాడు ఆ టీచర్. ఓ రెండు బీర్ బాటిల్స్ అతని వద్ద ఉన్నట్లు వీడియోలో కనిపించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్‌లో వెలుగు చూసింది.
తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తూనే.. టీచర్ బీర్లు తాగాడు. ఒక బీర్ క్యాన్ అయిపోవడంతో తన కాళ్ల వద్ద ఉంచాడు. మరో బీర్ బాటిల్‌ను తాను కూర్చొన్న కుర్చీ లో ఉంచాడు. ఈ ఘటనను వీడియో తీస్తుండగా.. బీర్ బాటిల్‌ను దాచేందుకు టీచర్ యత్నించాడు. క్లాస్ రూమ్‌లోనే టీచర్ బీర్లు తాగడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మాలివాల్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. తరగతి గదిలోనే విద్యార్థుల ముందు బీర్లు తాగిన టీచర్‌పై చర్యలు తీసుకోవాలని స్వాతి మాలివాల్ యూపీ పోలీసులను ఆదేశించారు.