Team India’s new jersey | ప్రపంచ కప్‌కు.. టీమిండియా కొత్త జెర్సీ

Team India's new jersey విధాత: ఐసీసీ ప్రపంచకప్ టీమిండియా క్రికెట్ జట్టు జెర్సీని స్పాన్సర్ అడిడాస్ స్వల్ప మార్పులు చేసింది. జెర్సీలో భుజాలపై ఉన్న మూడు తెలుపు రంగు అడ్డగీతల స్థానంలో త్రివర్ణ పతాకంలోని మూడు రంగులను కాషాయం, తెలుపు, ఆకుపచ్చలను ముద్రించడంతో పాటు టీమ్ లోగోపై ఉన్న మూడు నక్షత్రాలను రెండుగా చేసింది. ఈ నక్షత్రాలలో భారత్ సాధించిన 1983, 2011రెండు వరల్డ్ కప్‌లను గెలిచిన దానికి ప్రతీకగా ఏర్పాటు చేశారు. త్రివర్ణ పతాకం […]

  • By: krs    latest    Sep 20, 2023 3:43 PM IST
Team India’s new jersey | ప్రపంచ కప్‌కు.. టీమిండియా కొత్త జెర్సీ

Team India’s new jersey

విధాత: ఐసీసీ ప్రపంచకప్ టీమిండియా క్రికెట్ జట్టు జెర్సీని స్పాన్సర్ అడిడాస్ స్వల్ప మార్పులు చేసింది. జెర్సీలో భుజాలపై ఉన్న మూడు తెలుపు రంగు అడ్డగీతల స్థానంలో త్రివర్ణ పతాకంలోని మూడు రంగులను కాషాయం, తెలుపు, ఆకుపచ్చలను ముద్రించడంతో పాటు టీమ్ లోగోపై ఉన్న మూడు నక్షత్రాలను రెండుగా చేసింది.

ఈ నక్షత్రాలలో భారత్ సాధించిన 1983, 2011రెండు వరల్డ్ కప్‌లను గెలిచిన దానికి ప్రతీకగా ఏర్పాటు చేశారు. త్రివర్ణ పతాకం రంగులతో ముద్రించిన ఈ వరల్డ్ కప్ కొత్త జెర్సీపై క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన జట్టు ప్రపంచ్ కప్ ఈ దఫా తప్పక గెలుస్తుందని, త్రివర్ణ పతాకాన్ని సగౌరవంగా ఎగిరేలా చేస్తుందంటు నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

ఇటీవల అడిడాస్‌ ప్రపంచ కప్‌తో పాటు అన్ని ఫార్మాట్లలో టీమిండియా క్రికెట్ జట్టు ఆటగాళ్ల జెర్సీని మార్చింది. కొత్త స్పాన్సర్ అడిడాస్ పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టుకు సంబంధించి కూడా మూడు ఫార్మాట్‌లలో వేర్వేరు జెర్సీలను అడిడాస్ రూపొందించింది.

టీ 20ల్లో కాలర్ లేకుండా డార్క్ బ్లూ కలర్ జెర్సీ, వన్డేల్లో కాలర్‌తో లైట్ బ్లూ కలర్ జెర్సీ, టెస్టుల్లో వైట్ కలర్ జెర్సీలను అడిడాస్ తీసుకొచ్చింది. జెర్సీలపై కుడివైపు అడిడాస్ లోగోను, ఎడమవైపు బీసీసీఐ లోగో, దానిపై మూడు నక్షత్రాలు, మధ్యలో లీడ్ స్పాన్స్ డ్రీమ్ 11పేరు, దాని కింద పెద్ద అక్షరాలలో ఇండియా అని రాసి ఉంది.

జెర్సీ పైభుజాల భాగంలో మూడు తెలుపు రంగు అడ్డగీతలు ఉంటాయి. తాజాగా వరల్డ్ కప్ జెర్సీలో అడిడాస్ కంపనీ జెర్సీలో స్వల్ప మార్పులు చేసింది. భుజాలపై తెలుపు గీతల స్థానంలో జాతీయ పతాకంలోని త్రివర్ణ గీతలను, మూడు నక్షత్రాలను రెండు నక్షత్రాలుగా ఏర్పాటు చేసింది.