Heart surgery। నిమ్స్‌లో చిన్నారులకు గుండె సర్జరీలు.. UK నుంచి వచ్చిన వైద్య బృందం
Heart surgery for children at NIMS by UK Doctors యూకే నుండి వచ్చిన వైద్య బృందం సహకారంతో చికిత్స మంత్రి హరీశ్ రావు ఆహ్వానం మేరకు వచ్చిన హైదరాబాద్ వచ్చిన బ్రిటన్ డాక్టర్లు నాలుగు రోజుల్లో 8 మందికి శస్త్రచికిత్సలు పూర్తి నెలన్నర శిశువుకు విజయవంతంగా సర్జరీ అభినందనలు తెలిపిన మంత్రి హరీశ్‌రావు Heart surgery for children at NIMS by UK Doctors । నిమ్స్ హాస్పిటల్ లో గత నాలుగు […]

Heart surgery for children at NIMS by UK Doctors
- యూకే నుండి వచ్చిన వైద్య బృందం సహకారంతో చికిత్స
- మంత్రి హరీశ్ రావు ఆహ్వానం మేరకు వచ్చిన హైదరాబాద్ వచ్చిన బ్రిటన్ డాక్టర్లు
- నాలుగు రోజుల్లో 8 మందికి శస్త్రచికిత్సలు పూర్తి
- నెలన్నర శిశువుకు విజయవంతంగా సర్జరీ
- అభినందనలు తెలిపిన మంత్రి హరీశ్‌రావు
Heart surgery for children at NIMS by UK Doctors । నిమ్స్ హాస్పిటల్ లో గత నాలుగు రోజులకుగా చిన్నారులకు అరుదైన గుండె సర్జరీలను బ్రిటన్‌కు చెందిన డాక్టర్ల బృందం నిర్వహిస్తున్నది. ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు (Minister Harish Rao) ప్రత్యేక ఆహ్వానం మేరకు హైదరాబాద్‌కు వచ్చిన ఆరుగురు డాక్టర్ల బృందం నిమ్స్ ఆసుపత్రిలో అరుదైన గుండె జబ్బులతో బాధ పడుతున్న చిన్నారులకు సర్జరీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 8 సర్జరీలు పూర్తి చేశారు.
విధాత: బ్రిటన్ నుంచి డాక్టర్ వెంకట రమణ దన్నపునేని (Dr. Venkataramana Dannapuneni) నేతృత్వంలోని ఆరుగురు వైద్యుల బృందం నిమ్స్, నిలోఫర్ ఆసుపత్రులకు చెందిన వైద్యుల పరస్పర సహకారంలో చిన్నారులకు గుండె అపరేషన్లు నిర్వహించింది. చిన్నారులకు గుండె సర్జరీలు అనేది, ఎంతో క్లిష్టమైనది, ఖరీదైనది.
ప్రైవేటులో దాదాపు 5 లక్షల దాకా అయ్యే సర్జరీలను పేద చిన్నారులకు ఉచితంగా అందించాలని తెలంగాణ ప్రభుత్వం (Govt of Telangana) ఆలోచించి నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు సర్జరీలు జరుగుతున్నాయి. తాజాగా నెల రోజుల వయసున్న శిశువుకు విజయవంతంగా సర్జరీ చేశారు.
నెలన్నర శిశువుకు విజయవంతంగా సర్జరీ
మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌కు చెందిన నెల రోజుల వయసున్న శిశువు (One month Infant) (తల్లి ఫాతిమా) ఇటీవల తీవ్ర హృద్రోగ సమస్యలతో నిమ్స్ ఆసుపత్రిలో చేరింది. అప్పటికి శిశువు బరువు కేవలం 2.5 కిలోలు. ఆర్టీరియల్ అనాటమీ (Arterial Anatomy), మల్టిపుల్ వెంట్రిక్యులార్ సెప్టల్ డిఫెక్ట్స్ (multiple ventricular septal defect)ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.
బ్రిటన్ నిపుణులు, నిమ్స్ వైద్యులు, నిలోఫర్ డాక్టర్లు కలిసి ఒక బృందంగా ఏర్పడ్డారు. గత నెల 28న శిశువుకు ఆర్టీరియల్ స్విచ్ రిపెయిర్, మల్టిపుల్ వీఎస్‌డీ క్లోజర్ సర్జరీలు విజయ వంతంగా నిర్వహించారు. ప్రభుత్వ దవాఖానలో ఇలాంటి సర్జరీ జరగడం రాష్ట్రంలోనే మొదటిసారి. శిశువు ప్రస్తుతం ఐసీయూలో ఉన్నది. క్రమంగా కోలుకుంటున్నది.
మంత్రి హరీశ్ రావు అభినందనలు
అరుదైన సర్జరీ చేసి శిశువు ప్రాణం కాపాడిన నిమ్స్ వైద్యులను ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అభినందించారు. బ్రిటన్ నుంచి ప్రత్యేక వైద్య బృందం వచ్చి నిమ్స్ లో చిన్నారులకు చేసే సర్జరీల్లో పాల్గొనడం, సహకారం అందించడం గొప్ప విషయమన్నారు. శిశువు త్వరలోనే పూర్తిగా కోలుకొని తల్లి ఒడికి చేరాలని కోరుకుంటున్నానన్నారు.