Nagarjuna Sagar | సాగర్ కుడి కాలువ నీటి విడుదల ఆపండి.. తెలంగాణ అధికారుల వినతి

విధాత: నాగార్జునసాగర్ (Nagarjunasagar) ప్రాజెక్టు కుడి కాలువకు ఏపీ అధికారులు తక్షణమే నీటి విడుదల నిలిపివేయాలని ప్రాజెక్టు తెలంగాణ అధికారులు (Telangana Officers) మరోసారి ఏపీ అధికారుల (AP Officers)కు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. గత ఏడాది జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు కుడి కాలువ ద్వారా 184.692 టీఎంసీ నీటిని సాగు తాగునీటి అవసరాల కోసం ఏపీ వాడుకోవడం జరిగిందని ఈఈ మల్లికార్జున్ (EE Mallikarjuna) లేఖలో పేర్కొన్నారు. కృష్ణ బోర్డు (Krishna […]

  • By: Somu    latest    Mar 16, 2023 12:06 PM IST
Nagarjuna Sagar | సాగర్ కుడి కాలువ నీటి విడుదల ఆపండి.. తెలంగాణ అధికారుల వినతి

విధాత: నాగార్జునసాగర్ (Nagarjunasagar) ప్రాజెక్టు కుడి కాలువకు ఏపీ అధికారులు తక్షణమే నీటి విడుదల నిలిపివేయాలని ప్రాజెక్టు తెలంగాణ అధికారులు (Telangana Officers) మరోసారి ఏపీ అధికారుల (AP Officers)కు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. గత ఏడాది జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు కుడి కాలువ ద్వారా 184.692 టీఎంసీ నీటిని సాగు తాగునీటి అవసరాల కోసం ఏపీ వాడుకోవడం జరిగిందని ఈఈ మల్లికార్జున్ (EE Mallikarjuna) లేఖలో పేర్కొన్నారు.

కృష్ణ బోర్డు (Krishna Board) కేటాయించిన 132 టీఎంసీల కంటే అదనంగా 52.692 టీఎంసీల నీటిని వాడుకున్నందున తక్షణమే కుడికాలువకు నీటి విడుదల ఆపాలని తెలంగాణ కోరుతుందన్నారు. ప్రస్తుతం రిజర్వాయర్లో నీటి మట్టం క్రమంగా తగ్గిపోతున్నందున భవిష్యత్తు ఉమ్మడి రాష్ట్ర ప్రజల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని మార్చి 6వ తేదీన పై అధికారుల ఆదేశాల మేరకు కుడికాలువ పవర్ హౌస్‌ (Power House) కి వెళ్లి నీటిని ఆపాలని ఏపీ అధికారులతో చర్చించామన్నారు.

కానీ మూడు రోజుల క్రితం మీడియాకు ఏపీ సాగర్ ఈఈ శ్రీహరి (EE Sri Hari) తెలంగాణ అధికారులు వారిపై దౌర్జన్యానికి పాల్పడినట్లు చెప్పారని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా మల్లికార్జున్ తెలిపారు. కృష్ణ బోర్డు ఈనెల 15 నుండి సాగర్ కుడి కాలువ నీటి విడుదలను ఆపాలని ఏపీ అధికారాలను ఆదేశించిందని, ఈ మేరకు ఏపీ అధికారులు నీటి విడుదల ఆపాలని తాము మరోసారి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

ప్రస్తుతం శ్రీశైలంలో 817 అడుగుల (39.02టిఎంసీలు)కు పడిపోగా, సాగర్ ప్రాజెక్టులో 538 అడుగుల (144.18 టీఎంసీల) కు నీటిమట్టం పడిపోయిందని కృష్ణానది యాజమాన్య బోర్డు పేర్కొంది. సాగర్ కుడి కాలువ పవర్ హౌస్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడంతో రోజుకు 9 వేల క్యూసెక్కులకు పైగా నీరు ఏపీ తరలిస్తుందని బోర్డు గుర్తించింది.

సాగర్‌లో నీటి నిల్వలు వేగంగా తగ్గుతున్నందున ప్రాజెక్టు పరిధిలో సాగవుతున్న ఎనిమిది లక్షల ఎకరాల పంటలకు, హైదరాబాద్ జంట నగరాలకు అవసరమైన 270 ఎంజీడీల తాగునీటి కి కొరత ఏర్పడుతుందని, అదే జరిగితే తెలుగు రాష్ట్రాల మధ్య శాంతిభద్రతల సమస్య ఏర్పడే ప్రమాదం ఉందని బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది.

వెంటనే సాగర్ కుడికాలువ నుంచి నీటి విడుదల ఆపాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు ఏపీ ని కోరింది. బోర్డు ఆదేశాల మేరకు వెంటనే కుడికాలువకు నీటి విడుదల ఆపాలని నాగార్జునసాగర్ తెలంగాణ నీటిపారుదల అధికారులు మరోసారి అధికారులకు విజ్ఞప్తి చేశారు.