తెలంగాణ అప్పులు రూ.4,32,212.55 కోట్లు: పార్లమెంట్‌లో ప్రకటించిన కేంద్రం
PARLAMENT, MP UTTHAM, BJP, BRS, BANKS నేరుగా ప్రభుత్వం చేసిన అప్పులు రూ. 2,83,452 కోట్లు కార్పోరేషన్ల ద్వారా చేసిన అప్పు రూ. 1,48,765.55 కోట్లు రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న అప్పు రూ.75,577 కోట్లు ఎస్‌బీఐతో పాటు 12 బ్యాంకులు, నాబార్డ్ నుంచి రుణాలు ఎంపీ ఉత్తమ్ ప్రశ్నకు పార్లమెంట్‌లో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం విధాత: రాష్ట్ర ఏర్పాటు తరువాత తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేసిందని […]

PARLAMENT, MP UTTHAM, BJP, BRS, BANKS
- నేరుగా ప్రభుత్వం చేసిన అప్పులు రూ. 2,83,452 కోట్లు
- కార్పోరేషన్ల ద్వారా చేసిన అప్పు రూ. 1,48,765.55 కోట్లు
- రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న అప్పు రూ.75,577 కోట్లు
- ఎస్‌బీఐతో పాటు 12 బ్యాంకులు, నాబార్డ్ నుంచి రుణాలు
- ఎంపీ ఉత్తమ్ ప్రశ్నకు పార్లమెంట్‌లో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం
విధాత: రాష్ట్ర ఏర్పాటు తరువాత తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేసిందని కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంట్‌కు తెలిపింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులెన్ని, ఉమ్మడి రాష్ట్రం నుంచి వారసత్వంగా వచ్చిన అప్పులెన్ని పూర్తి వివరాలు ఇవ్వాలని నల్లగొండ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా, కార్పోరేషన్ల ద్వరా కలిపి రూ. 4,32,212.55 కోట్ల అప్పు చేసిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు విపరీతంగా పెరిగి పోయాయన్నారు. ప్రభుత్వం నేరుగా చేసిన అప్పులతో పాటు కార్పోరేషన్ల పేరుతో వివిధ బ్యాంకులు, సంస్థల నుంచి తీసుకున్న అప్పుల వివరాలు కూడ మంత్రి పార్లమెంట్‌కు తెలిపారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి 2014 జూన్ 2వ తేదీ నాటికి ఉన్న రాష్ట్ర అప్పు రూ.75,577 కోట్లు అని తెలిపారు. 2014 జూన్ 2వ తేదీ నుంచి 2022 అక్టోబర్ నెలాఖరు వరకు తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పు రూ.2,07,875 కోట్ల అప్పు చేసిందని, మొత్తంగా కలిసి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చేసిన అప్పు మొత్తం రూ. 2,83,452 కోట్లు అని తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కాకుండా వివిధ కార్పో రేషన్ల ద్వరా ప్రభుత్వ బ్యాంకులు, నాబార్డ్‌కు చెందిన వివిధ సంస్థల నుంచి రూ. 1,48,760.55 కోట్ల రుణం తీసుకున్నది. 12 ప్రభుత్వ బ్యాంకుల నుంచి రూ.1,29,744.54 కోట్ల రుణం తీసుకోగా, నాబార్డ్‌కు చెందిన రూరల్ ఇన్‌ఫ్రా స్టక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్, వేర్ హౌజ్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ ఫండ్, ఫుడ్ ప్రాసెసింగ్ ఫండ్, నాబార్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అసిస్టెన్స్(ఎన్ ఐడీఏ)ల నుంచి19,016.01 కోట్ల రుణం తీసుకున్నది. ఇలా తెలంగాణ ప్రభుత్వం నేరుగానూ, కార్పోరేషన్ల ద్వారాను అత్యధికంగా రుణాలు తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు బ్యాంకుల వారీగా వివరాలు కూడా తెలియజేసింది.