మేడిగడ్డ వద్ద ఉద్రిక్తత
బీఆరెస్ తలపెట్టిన చలో మేడిగడ్డ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. పెద్ద సంఖ్యలో మేడిగడ్డ బ్యారేజీ వద్ధకు చేరుకున్న బీఆరెస్ శ్రేణులు బ్యారేజీ ప్రధాన గేట్లను

బ్యారేజీ గేట్లు తోసుకుని వెళ్లిన బీఆరెస్ శ్రేణులు
సీఎం డౌన్ డౌన్ అంటు నినాదాలు
విధాత : బీఆరెస్ తలపెట్టిన చలో మేడిగడ్డ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. పెద్ద సంఖ్యలో మేడిగడ్డ బ్యారేజీ వద్ధకు చేరుకున్న బీఆరెస్ శ్రేణులు బ్యారేజీ ప్రధాన గేట్లను తోసుకుని ఒక్కసారిగా బ్యారేజీపైకి దూసుకెళ్లారు. సీఎం డౌన్ డౌన్ అంటు నినాదాలు చేశారు. మరికొందరు బ్యారేజీ దిగువన నదిలోని కుంగిన పిల్లర్ల వద్దకు చేరుకున్నారు. గుంపులు గుంపులుగా బీఆరెస్ శ్రేణులు అక్కడ పరుగులు తీయడంతో పోలీసులు వారిని నియంత్రించలేకపోయారు. బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు టి.హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రభృతులు బ్యారేజీ వద్ధకు వెళ్లారు.
బ్యారేజీ పైన, దిగువన కుంగిన పిల్లర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ మేడిగడ్డపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేయకుండా మరమ్మతులు చేసి రైతులకు నీరందించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. గతంలో కడియం ప్రాజెక్టు సహా పలు ప్రాజెక్టులు కొట్టుకపోగా మరమ్మతులు చేసి వాటిని వినియోగంలోకి తెచ్చి రైతులకు సాగునీరందించడం జరిగిందన్నారు. రీపేర్ల పేరుతో ప్రాజెక్టులను మూలన పడేయడం సరికాదన్నారు.