జనగామలో ఉద్రిక్తత.. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య వాగ్వివాదం
శాసనసభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో గురువారం జనగామ నియోజకవర్గం రైల్వే స్టేషన్ సమీపంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నది

- బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా తీరుపై ఆగ్రహం
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: శాసనసభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో గురువారం జనగామ నియోజకవర్గం రైల్వే స్టేషన్ సమీపంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నది. జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి పోలింగ్ సందర్భంగా అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలింగ్ సరళిని పరిశీలించే పేరిట పోలింగ్ స్టేషన్ల వద్ద రాజేశ్వర్ రెడ్డి ఎక్కువ సమయం గడుపుతూ ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు.
పోలింగ్ ప్రారంభమైనందున ఓటర్లను ప్రభావితం చేసే విధంగా గులాబీ కండువా కప్పుకొని పోలింగ్ స్టేషన్లోకి వెళ్తున్నారని విమర్శించారు. ఈసందర్భంగా రైల్వే స్టేషన్ సమీపంలో ఒకే బూతు వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు తారసపడడంతో పరస్పరం ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగారు. పరస్పరం దూషించుకున్నారు. పరిస్థితి చేయి దాటకముందే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు.