అది.. కేసీఆర్ అల్లిన ఓ కట్టు కథ: రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్
విధాత: బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఆ పార్టీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బీజేపీ ఓబీసీ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. ఈ వ్యహారమంతా కేసీఆర్ అల్లిన ఓ కట్టు కథ అని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలో పోలీసులు భాగస్వాములు కావొద్దని ఆయన కోరారు. ఓటమి భయంతోనే ఇలాంటి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం […]

విధాత: బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఆ పార్టీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బీజేపీ ఓబీసీ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ స్పందించారు.
ఈ వ్యహారమంతా కేసీఆర్ అల్లిన ఓ కట్టు కథ అని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలో పోలీసులు భాగస్వాములు కావొద్దని ఆయన కోరారు. ఓటమి భయంతోనే ఇలాంటి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంలో టీఆర్ఎస్‌కు చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ నియంత పాలనతో ఎమ్మెల్యేలే విసిగిపోతున్నారు. ఈటల రాజేందర్ వ్యవహారమే ఇందుకు ప్రధాన ఉదాహరణ అన్నారు.
కేసీఆర్ మోసపు మాటలు నమ్మేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. బీజేపీలో చేరాలంటే రాజీనామా చేసి పార్టీలోకి రమ్మంటాం. టీఆర్ఎస్ కుట్రలను భగ్నం చేసి న్యాయపోరాటం చేస్తామని లక్ష్మణ్ పేర్కొన్నారు