ఫాం హౌస్‌కు అందుకే వెళ్లాం.. ఇరికించారు: నిందితులు

విధాత: తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్యేల కోనుగోలు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే ఈ క్రమంలోనే నిజానిజాలు ఇప్పట్లో బయటికొచ్చేలా కనిపించడం లేదు. నిందితులు రెండు పార్టీలవారితో కలిసున్న పాత ఫోటోలు బయటికి రావడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. తప్పు మీదంటే మీదని టీఆర్ఎస్, బీజేపీ దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. డీల్‌కు వేదికైన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌజ్‌లో భేటీ ఏర్పాట్లపై నిందితులు నోరు విప్పారు. లక్ష్మీపూజ […]

ఫాం హౌస్‌కు అందుకే వెళ్లాం.. ఇరికించారు: నిందితులు

విధాత: తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్యేల కోనుగోలు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే ఈ క్రమంలోనే నిజానిజాలు ఇప్పట్లో బయటికొచ్చేలా కనిపించడం లేదు. నిందితులు రెండు పార్టీలవారితో కలిసున్న పాత ఫోటోలు బయటికి రావడంతో తీవ్ర గందరగోళం నెలకొంది.

తప్పు మీదంటే మీదని టీఆర్ఎస్, బీజేపీ దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. డీల్‌కు వేదికైన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌజ్‌లో భేటీ ఏర్పాట్లపై నిందితులు నోరు విప్పారు. లక్ష్మీపూజ కోసమే తాము అక్కడికి వెళ్లామని, అక్కడ ఎలాంటి కొనగోళ్లూ జరగేదని చెప్పారు. రిమాండుకు పంపడానికి తగిన కారణాలు లేకపోవడంతో కోర్టు వదిలేసిన తర్వాత వారు మీడియాతో మాట్లాడారు.

‘‘సామ్రాజ్యలక్ష్మి పూజ కోసమే అక్కడికి వెళ్లాను. తిరుపతి నుంచి వచ్చిన సింహయాజి స్వామితో కలసి వెళ్లాను. ఆ ఎమ్మెల్యేల్లో ఒకరు నాకు పరిచయం. డీల్ వంటిది ఏమీ జరగలేదు. ఎన్నికలు ఉండడంతో మమ్మల్ని ఇరికించారు’ అని నందకుమార్ చెప్పాడు. అయితే పూజ చేయాలని ఎవరు కోరారో చెప్పడానికి మాత్రం నిరాకరించారు.

పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావులకు 100 కోట్ల చొప్పన ఆశ చూపి బీజేపీలో చేరాలని, లేకపోతే ఈడీ కేసులు పెడతామని నిందితులు బెదిరించినట్లు ఆరోపణలు రావడం తెలిసిందే. అయితే అవినీతికి పాల్పడినట్లు పక్కా సాక్ష్యాలు లేకపోవడంతో నిందితులను కోర్టు వదిలేసింది.