Viral: గోడెక్కి.. పంచాయితీ (గొడవ) చూస్తున్న కుక్క? (Video)

Dog Jumped:
ఇంటి కాపలా కుక్క ఇంటి రక్షణకే పరిమితమవ్వడం తెలిసిందే. అయితే ఓ ఇంటి కుక్క పక్కింటిలో ఏం జరుగుతుంతో చూసేందుకో లేక..పక్కింటి ఆడకుక్కకు లైన్ వేసేందుకే ఏమోగాని మొత్తానికి గోడ దూకి పక్కింటిలో దూరాలని చూసింది. ఇందుకు ఎత్తైన గోడను దూకే క్రమంలో ఆ కుక్క చూపిన తెలివి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గోడ కొంత దూరంలో ఉన్న కొబ్బరి చెట్టు వెనుక కాళ్లను, గోడకు ముందుకాళ్లను పెట్టి క్రమంగా గోడపైకి చేరింది. ఇందుకు కుక్క చేసిన విన్యాసం..పడిన పాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
పక్కింటిలో జరిగే కార్యక్రమానికి ఆహ్వానం లేదని.. పాపం ఇలా గోడ ఎక్కి చూసేందుకు తిప్పలు పడిందని కామెంట్లు పెట్టారు. మరికొందరు పక్కింటి ఆడ కుక్క కోసం ప్రియుడు చేసిన సాహసం అని మరికొందరు కామెంట్లు పెట్టారు. ఇక రాజకీయంగా మరికొందరు అమరావతి రాజధాని ప్రారంభోత్సవానికి ప్రతిపక్ష నేత వైఎస్. జగన్ నేరుగా వెళ్లలేక ఇలా గోడ చాటున తొంగి చూస్తున్నాడంటూ మరికొందరు కామెంట్లు పెట్టారు.