ఆవుపై కుక్క దాడి.. ముగ్గురు పట్టినా విడవలే (వీడియో)
విధాత: ఓ కుక్క ఆవును హడలెత్తించింది. ఆవును కుక్క తన నోటితో అదిమిపట్టి.. బీభత్సం సృష్టించింది. ఆవు నోటికి తీవ్ర గాయం చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాన్పూర్‌కు చెందిన ఓ వ్యక్తి తన పిట్ బుల్ డాగ్‌ను తీసుకొని ఇంటి బయటకొచ్చాడు. ఇంకేముందు ఆ కుక్క వీరంగం సృష్టించింది. ఆవుపై దాడి చేసింది. ఆవు నోటిని తన పండ్లతో అదిమి పట్టి కొరికింది. ఆ నొప్పికి […]

విధాత: ఓ కుక్క ఆవును హడలెత్తించింది. ఆవును కుక్క తన నోటితో అదిమిపట్టి.. బీభత్సం సృష్టించింది. ఆవు నోటికి తీవ్ర గాయం చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాన్పూర్‌కు చెందిన ఓ వ్యక్తి తన పిట్ బుల్ డాగ్‌ను తీసుకొని ఇంటి బయటకొచ్చాడు. ఇంకేముందు ఆ కుక్క వీరంగం సృష్టించింది. ఆవుపై దాడి చేసింది. ఆవు నోటిని తన పండ్లతో అదిమి పట్టి కొరికింది. ఆ నొప్పికి ఆవు కూడా గట్టిగా అరిచింది. కుక్క దాడి నుంచి ఆవును రక్షించేందుకు పలువురు శ్రమించారు.
కుక్కను కర్రలతో బాది.. ఆవును రక్షించారు. ఆవుకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయనున్నట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆర్కే నిరంజన్ తెలిపారు. ఇటీవలి కాలంలో యూపీలో కుక్కల దాడులు వరుసగా చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఘజియాబాద్, నోయిడాలో పిల్లలపై కుక్కలు దాడులు చేసిన విషయం విదితమే.