Warangal: దంప‌తుల మ‌ధ్య క‌ల‌హాలు.. కన్న బిడ్డలకు విషమిచ్చిన కసాయి తండ్రి

పెద్ద కూతురు మృతి.. విషమంగా చిన్న కూతురు పరిస్థితి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: భార్య మీద కోపాన్ని మనసులో పెట్టుకొని కన్న తండ్రి శ్రీను చిన్నారులు ఇద్దరికీ విషాన్ని కలిపిన కూల్ డ్రింక్‌ను తాగించాడు. ఈ సంఘటనలో పెద్దబిడ్డ మృతిచెందగా చిన్నపాప హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నది. ఈ సంఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామ శివారు జానకిపురం గ్రామంలో జరిగింది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాలు.. జానకీపురం గ్రామానికి చెందిన గుండె శ్రీనుతో […]

Warangal: దంప‌తుల మ‌ధ్య క‌ల‌హాలు.. కన్న బిడ్డలకు విషమిచ్చిన కసాయి తండ్రి
  • పెద్ద కూతురు మృతి.. విషమంగా చిన్న కూతురు పరిస్థితి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: భార్య మీద కోపాన్ని మనసులో పెట్టుకొని కన్న తండ్రి శ్రీను చిన్నారులు ఇద్దరికీ విషాన్ని కలిపిన కూల్ డ్రింక్‌ను తాగించాడు. ఈ సంఘటనలో పెద్దబిడ్డ మృతిచెందగా చిన్నపాప హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నది. ఈ సంఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామ శివారు జానకిపురం గ్రామంలో జరిగింది.

ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాలు..

జానకీపురం గ్రామానికి చెందిన గుండె శ్రీనుతో దర్దెపల్లి గ్రామానికి చెందిన ధనలక్ష్మికి పదేళ్ల క్రితం పెళ్లి అయింది. వీరికి నాగప్రియ(9), నందిని (5), రక్షిత్ తేజ్ (4) ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు. శ్రీను మేస్త్రీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్యను వేధించిన కేసులో శ్రీను జైలుకు వెళ్లి వచ్చాడు.

దీంతో ధనలక్ష్మి భర్తను విడిచి పిల్లలతో పుట్టింటికి వెళ్లింది. పెద్ద మనుషులు రాజీ కుదిర్చి ఆమెను కాపురానికి పంపించారు. తీరు మారని శ్రీను భార్యను వేధిస్తూనే ఉన్నాడు. విసిగిపోయిన ధనలక్ష్మి పుట్టింటికి వెళ్లింది. భార్య తనతో లేనప్పుడు పిల్లలు ఎందుకని భావించిన శ్రీను వారిని చంపాలనుకున్నాడు.

ఈ నెల 6న కూల్ డ్రింక్‌లో విషం కలిపి కుమార్తెలకు ఇచ్చాడు. అదేమీ తెలియని పిల్లలు దాన్ని తాగారు. అపస్మారక స్థితికి చేరిన పిల్లలను జనగామ ఆస్పత్రికి తరలించాడు. పెద్ద కుమార్తె నాగప్రియ పరిస్థితి విషమించడంతో ఎంజీఎం తరలించగా చికిత్సపొందుతూ సోమవారం మృతిచెందింది.

చిన్న కుమార్తె నందిని ఆరోగ్యం ఆందోళనకరంగా మారడంతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. భార్య ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు శ్రీనుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ సంఘటన గ్రామంలోని వారందరిని కలిచి వేసింది.