Karimnagar | కూతురి పెళ్లిరోజే.. గుండెపోటుతో తండ్రి మృతి
Karimnagar | విధాత బ్యూరో, కరీంనగర్: కుమార్తె వివాహం రోజే తండ్రి గుండె ఆగిపోయింది. ఘటన ఆదివారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండలం అంబాల్ పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం అంబాల్ పూర్ గ్రామానికి చెందిన ఎర్రల రాములు, మంజుల దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె లావణ్య వివాహం ఆదివారం మండలంలోని కొత్తగట్టు గుట్టపై మత్స్య గిరీంద్ర స్వామి దేవాలయంలో జరగాల్సి ఉంది. కుటుంబ సభ్యులతో కలసి వివాహ […]

Karimnagar |
విధాత బ్యూరో, కరీంనగర్: కుమార్తె వివాహం రోజే తండ్రి గుండె ఆగిపోయింది. ఘటన ఆదివారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండలం అంబాల్ పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం అంబాల్ పూర్ గ్రామానికి చెందిన ఎర్రల రాములు, మంజుల దంపతులకు ముగ్గురు కుమార్తెలు.
పెద్ద కుమార్తె లావణ్య వివాహం ఆదివారం మండలంలోని కొత్తగట్టు గుట్టపై మత్స్య గిరీంద్ర స్వామి దేవాలయంలో జరగాల్సి ఉంది. కుటుంబ సభ్యులతో కలసి వివాహ ఏర్పాట్లు చేస్తున్న రాములు.. ఛాతిలో నొప్పితో కుప్పకూలిపోయాడు.
కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కేశవపట్నంలోని ఆర్ఎంపీ దగ్గరికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనతో కుటుంబ సభ్యుల రోదనలు ఆకాశాన్నంటాయి. కూతురు పెళ్లి రోజే రాములు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.