Jharkhand | ట్రాక్‌పై నిలిచిన ట్రాక్టర్.. రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ఘోర ప్రమాదం..
సకాలంలో గురించి బ్రేక్ వేసిన రైలు డ్రైవర్ జార్ఖండ్‌లోని సంతల్‌దిహ రైల్వే క్రాసింగ్ వద్ద ఘటన ఒడిశా ఘోరం మరువకముందే మరో ఘటన విధాత: ఒడిశాలో మూడు ఘోరంగా రైళ్లు ఢీకొన్న దారుణ ఘటనను మరువక ముందే, తాజాగాలో మరో రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. జార్ఖండ్ (Jharkhand) బొకారోలోని సంతల్‌దిహ రైల్వే క్రాసింగ్ వద్ద మంగళవారం సాయంత్రం ఒక ట్రాక్టర్ రైలు పట్టాల పైనే నిలిచిపోయింది. అదే సమయంలో న్యూఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ ఆ […]

- సకాలంలో గురించి బ్రేక్ వేసిన రైలు డ్రైవర్
- జార్ఖండ్‌లోని సంతల్‌దిహ రైల్వే క్రాసింగ్ వద్ద ఘటన
- ఒడిశా ఘోరం మరువకముందే మరో ఘటన
విధాత: ఒడిశాలో మూడు ఘోరంగా రైళ్లు ఢీకొన్న దారుణ ఘటనను మరువక ముందే, తాజాగాలో మరో రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. జార్ఖండ్ (Jharkhand) బొకారోలోని సంతల్‌దిహ రైల్వే క్రాసింగ్ వద్ద మంగళవారం సాయంత్రం ఒక ట్రాక్టర్ రైలు పట్టాల పైనే నిలిచిపోయింది.
అదే సమయంలో న్యూఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ ఆ ట్రాక్‌పై వస్తున్నది. భోజుదిహ్ రైల్వేస్టేషన్ సమీపంలో సంతల్‌దిహ రైల్వే క్రాసింగ్ వద్ద రైల్వే ట్రాక్ గేట్ మధ్య ట్రాక్టర్ ఇరుక్కు పోయింది.
రైలు వస్తున్న క్రమంలో గేట్ మెన్ గేటు వేయగా ట్రాక్టర్ గేటును ఢీకొని వచ్చి రైలు పట్టాలు, గేటు మధ్యలో ఇరుక్కుపోయింది. అయితే, రైలు డ్రైవర్ సకాలంలో ట్రాక్‌పై ట్రాక్టర్‌ను గురించి బ్రేక్‌లు వేయడంతో రైలు నిలిచిపోయిది. లేకుంటే భారీ ప్రమాదం జరిగి ఉండేదని ఈశాన్య రైల్వే డివిజన్ డీఆర్ ఎం మనీశ్‌కుమార్ తెలిపారు.
ట్రాక్టర్ వదిలేసి పారిపోయిన డ్రైవర్
ఈ ఘటన కారణంగా రాజధాని ఎక్స్‌ప్రెస్ 45 నిమిషాలు ఆలస్యంగా నడిచింది. ఈ ఘటనకు కారణమైన ట్రాక్టర్‌ను పోలీసులు సీజ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన గేట్‌ను రైల్వే అధికారులు సస్పెండ్ చేశారు. ట్రాక్టర్ రైల్వే గేట్ ఢీకొట్టగానే దానిని అక్కడే వదిలేసి డ్రైవర్ పారిపోయాడు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.ఇటీవలే ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదంలో 275 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 1100 మంది గాయాలపాలైన సంగతి తెలిసిందే.