అడ్డంగా దొరికిన దొంగలు మొరుగుతూనే ఉంటారు: కేటీఆర్‌

విధాత, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు డబ్బు ఎరవేసి కొనుగోలు చేసేందుకు బీజేపీ చేసిన ప్రయత్నం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్‌.. పార్టీ శ్రేణులను ఉద్దేశించి ట్విట్టర్‌లో ఒక ట్వీట్‌ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టిఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వాఖ్యానాలు చేయవద్దని విజ్జప్తి అడ్డంగా దొరికిన దొంగలు […]

అడ్డంగా దొరికిన దొంగలు మొరుగుతూనే ఉంటారు: కేటీఆర్‌

విధాత, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు డబ్బు ఎరవేసి కొనుగోలు చేసేందుకు బీజేపీ చేసిన ప్రయత్నం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్‌.. పార్టీ శ్రేణులను ఉద్దేశించి ట్విట్టర్‌లో ఒక ట్వీట్‌ చేశారు.

అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్టు మొరుగుతూనే ఉంటారని, వాటిని పార్టీ శ్రేణులు ఏమాత్రం పట్టించుకోవాల్సిన అసవరం లేదని మంత్రి కేటీఆర్‌ సూచించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున.. టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యానాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.