మత్స్యగిరి బ్రహ్మోత్సవాల్లో నేడు తిరు కల్యాణం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెంకటాపురంలోని సుప్రసిద్ధ మత్స్యగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.

  • By: Somu    latest    Nov 24, 2023 11:09 AM IST
మత్స్యగిరి బ్రహ్మోత్సవాల్లో నేడు తిరు కల్యాణం

విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెంకటాపురంలోని సుప్రసిద్ధ మత్స్యగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం ద్వారతోరణం, ధ్వజ కుంభ ఆరాధన, మూర్తి కుంభారాధన, చతుస్థానార్చన, నిత్య హోమాలు, పూర్ణాహుతి, శ్రీ స్వయంభు స్వామివారికి నవ కలశ స్నపనం, బలిహరణం, నివేదన, తీర్థప్రసాద గోష్టి నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో దేవదాయ ధర్మాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ ఎం.రామకృష్ణ రావు హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకుని, బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ మత్స్యగిరి లక్ష్మి నరసింహ స్వామివారి కళ్యాణం మహోత్సవం నిర్వహించనున్నట్లుగా ఈవో సల్వాది మోహన్ బాబు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో కల్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి తీర్దప్రసాదాలు స్వీకరించి తరించాలని కోరారు.