జ‌న్మ‌కో శివ‌రాత్రి.. నిజంగానే..! ఈ ఏటి మ‌హాశివ‌రాత్రి మ‌ళ్లీ చూడ‌లేరు.

ఈ ఏడాది మహా శివరాత్రి నాడు అత్యంత‌ అరుదైన శుభ యోగాలు ఏర్పడనున్నాయి. పంచాంగం ప్రకారం కొన్ని గ్ర‌హాలు వివిధ కూట‌ములుగా కూడ‌నున్నాయి

జ‌న్మ‌కో శివ‌రాత్రి.. నిజంగానే..! ఈ ఏటి మ‌హాశివ‌రాత్రి మ‌ళ్లీ చూడ‌లేరు.
  • మూడు రాశుల‌వారికి మ‌హాయోగం

ఈ ఏడాది మహా శివరాత్రి నాడు అత్యంత‌ అరుదైన శుభ యోగాలు ఏర్పడనున్నాయి. పంచాంగం ప్రకారం కొన్ని గ్ర‌హాలు వివిధ కూట‌ములుగా కూడ‌నున్నాయి. ఈ గ్ర‌హాల క‌ల‌యిక వ‌ల్ల ఈ సమయంలో కొన్ని శుభ‌యోగాలు ఏర్ప‌డి, మూడు రాశుల వారు ఆ ప‌ర‌మేశ్వ‌రుడి అనుగ్ర‌హానికిఅత్యంత ప్రీతిపాత్రుల‌య్యే అవ‌కాశం ఉంది.


ఈ నేపథ్యంలో ఈ ఏడాది మహా శివరాత్రి మార్చి 8వ తేదీన శుక్రవారం నాడు రాబోతుంది. స‌నాత‌న ధ‌ర్మ‌ పంచాంగం ప్రకారం, ఈ మహా శివరాత్రి వేళ సంభ‌వించే అరుదైన యోగాలు ఇవీ: 

1. శివ యోగం :

తెల్లవారుజామున 4:45 గంటల నుంచి రోజంతా శివ యోగం ఉంటుంది. ఏకాగ్ర‌త‌తో మంత్రోచ్ఛాట‌ణ‌, ధ్యానానికి ఈ రోజు శివ‌యోగం చాలా యోగ్య‌మైన స‌మ‌యం. శివ‌యోగం ఉన్నంత స‌మ‌యం ఏ మంత్రం ఏకాగ్ర‌త‌తో ప‌ఠించినా సిద్ధిస్తుంద‌ని జ్యోతిష‌శాస్త్రం చెబుతోంది. అలాగే చాలా శుభ ఫ‌లితాలు కూడా ల‌భించే అవ‌కాశాలున్నాయి.


2. సర్వార్ధ సిద్ధి యోగం:

అదే విధంగా ఉదయం 6:38 గంటల నుంచి సర్వార్ధ సిద్ధి యోగం ప్రారంభమై 10:41 గంటల వరకు ఉంటుంది. దాదాపు 300 సంవత్సరాల తర్వాత మహా శివరాత్రి రోజున ఇలాంటి యోగం రావడం విశేషం. ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్ధశి, మార్చి8, 2024 నాడు వచ్చే మహా శివరాత్రి, శివారాధనకు ప‌ర‌మ‌ప‌విత్ర‌మైన సర్వార్థ సిద్ధి యోగంతో పాటు శివయోగం, శ్రవణ నక్షత్రాల అద్భుత కలయిక నాడు జరగబోతోంది. మార్చి 9వ తేదీతో సిద్ది యోగం సమయం ముగుస్తుంది. ఇన్ని అద్భుతమైన యోగాల కలయిక కావడంతో శివరాత్రి రోజున శివారాధన చేసే పూజలకు రెట్టింపు ప్రతిఫలం దక్కనుంది.


3. చంద్ర మంగళ యోగం:

అదే సమయంలో జ్యోతిష్యం ప్రకారం, మకరంలో కుజుడు, చంద్రుడి కలయిక ఉంది. ఈ కారణంగా చంద్ర మంగళ యోగం ఏర్పడుతుంది.

4. త్రిగ్రాహి యోగం:

దీంతో పాటు కుంభ రాశిలో శుక్ర, శని, సూర్యుని కలయిక జరగనుంది. మీన రాశిలో రాహువు, బుధువు కలయికతో త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది.


5. శుక్ర ప్ర‌దోష వ్ర‌తం:

మహా శివరాత్రి రోజు ప్రదోష వ్రతం కూడా ఉంది. శుక్రవారం రావడంతో శుక్ర ప్రదోష ఉపవాసం ముఖ్యమైనదిగా పరిణమించింది. ఈ సమయంలో ఎవరైనా ఉద్యోగం, వ్యాపారంలో పనులు చేపడితే వారికి విజయం, ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. నిష్ట‌తో ఉప‌వాస‌దీక్ష‌, జాగ‌ర‌ణ చేస్తే రెట్టింపు శుభ‌ఫ‌లితాలు పొంద‌వ‌చ్చ‌ని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.


6. సిద్ధ యోగం

విఘ్నాలు తొలగించే వినాయకుడికి ప్రతి ఒక్కరూ తొలి పూజ అందిస్తారు. సిద్ధ యోగం అనేది అడ్డంకులు తొలగించే వినాయకుడికి సంబంధించినది. ఈ యోగంలో వినాయకుడిని పూజిస్తే చేపట్టే ప్రతి పనిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయం సొంతం అవుతుంది. ఈ ముహూర్తంలో ఏ పని తలపెట్టినా అది మీకు శ్రేయస్సు అందిస్తుంది.


7. శ్రవణ నక్షత్రం

శ్రవణ నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడు. ఈ నక్షత్రం వచ్చిన సమయంలో ఎటువంటి కార్యం తలపెట్టినా దానికి శని ఆశీస్సులు ఉంటాయి. శివుడికి భక్తుడు శనీశ్వరుడు. శివ అనుగ్రహంతో పాటు శని చల్లని చూపు మీమీద ఉంటుంది. అందుకే ఈరోజు పూజ చేయడంతో పాటు ఏదైనా కొత్త పనులు ప్రారంభించడం శుభప్రదంగా పరిగణిస్తారు.

ఈ సంద‌ర్భంగా కింది మూడు రాశుల‌వారికి మ‌హాదేవుడి అనుగ్ర‌హం ప‌రిపూర్ణంగా ఉండ‌బోతోంది.


మేష రాశి(Aries):

ఈ రాశి వారికి ప‌ర‌మేశ్వ‌రుడి అనుగ్రహం మెండుగా ఉంటుంది. ఈ రాశి వారికి మహాశివరాత్రి నుంచి ఆర్థిక పరంగా అద్భుత ప్రయోజనాలు క‌లిగి, కోరికలన్నీ నెరవేరుతాయి. కష్టాల‌న్నీ ఫ‌లిస్తాయి. నాయకత్వ సామర్థ్యాలు పెర‌గ‌డంతో పాటు, కెరీర్ పరంగా కొనసాగుతున్న సమస్యలన్నీ ముగిసి ప్ర‌గ‌తికి పునాదులు వేస్తాయి. వ్యాపారులు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది.


మిధున రాశి(Gemini):

ఈ రాశి వారికి మహా శివరాత్రి వేళ శంక‌రుడి దీవెన‌లు ప్ర‌త్యేకం. జీవితంలో పురోగతికి అవకాశాలొస్తాయి. మీరు పని చేసే రంగంలో మంచి విజయం, రాబోయే రోజుల్లో మంచి ప్రయోజనాలు పొందుతారు. చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులు ఆ మ‌హాశివుడి అనుగ్ర‌హంతో ఒక్కసారిగా తిరిగి ప్రారంభ‌మై, విజ‌యంతో ముగుస్తాయి.


సింహ రాశి(Leo):

ఈ రాశి వారికి శివరాత్రి వేళ చాలా లాభాలు పొందే అవ‌కాశ‌ముంది. పొందొచ్చు. ఆదాయం పెరగడంతో పాటు భాగస్వామ్యంతో చేసే వ్యాపారంలో చాలా లాభాలొస్తాయి. రుణాల‌నుండి ఉప‌శ‌మ‌నంతో పాటు కొత్త వాహనం, ఇల్లు లేదా ఆస్తి కొనుగోలు కల నెరవేరుతుంది. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో అవివాహితులకు మంచి వివాహ సంబంధం రావొచ్చు. మీ వైవాహిక / ప్రేమ జీవితం చాలా బాగుంటుంది.