BRSలోకి వెళ్లిన ఆ.. పది మంది MLAలపై అనర్హత వేటు వేయాలి: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
విధాత: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సభ్యత్వం రద్దు చేయాలన్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో సహా కాంగ్రెస్‌లో గెలిచి బిఆర్ఎస్లోకి పోయిన 10మంది ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని మొదట రద్దు చెయ్యాలని బిజెపి నేత మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం నార్కట్ పల్లి పట్టణంలో ఆర్ఆర్ఆర్ రెస్టారెంట్ ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే చిరుమర్తికి డిపాజిట్ కూడా రాదని, ఆయన వెంట ఉన్న నాయకులే […]

విధాత: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సభ్యత్వం రద్దు చేయాలన్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో సహా కాంగ్రెస్‌లో గెలిచి బిఆర్ఎస్లోకి పోయిన 10మంది ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని మొదట రద్దు చెయ్యాలని బిజెపి నేత మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.
శుక్రవారం నార్కట్ పల్లి పట్టణంలో ఆర్ఆర్ఆర్ రెస్టారెంట్ ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే చిరుమర్తికి డిపాజిట్ కూడా రాదని, ఆయన వెంట ఉన్న నాయకులే ఆయన ఓడిపోవాలని కోరుకుంటున్నారన్నారు.
2018లో నా వల్ల టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్యేగా గెలిచి నాకు వ్యతిరేకంగా మునుగోడులో ప్రచారం చేసిన ఎమ్మెల్యే చిరుమర్తికి విశ్వసనీయత లేదన్నారు. వచ్చే ఎన్నికలలో నకిరేకల్‌లో బీజేపీ అభ్యర్థి గెలవడం ఖాయమన్నారు. నకిరేకల్, మునుగోడు నాకు రెండు కళ్లు అన్నారు.
కేసీఆర్ కుటుంబం అధికారం అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు దోచుకున్నదని, వారు చేసిన పాపాలే వారిని జైలు పాలు చేస్తాయన్నారు. సీఎం కేసీఆర్ తాగిన మైకంలో అర్ధ రాత్రి ఏం చెయ్యాలో అర్ధం కాక బండి సంజయ్‌ని అరెస్ట్ చేయించాడని ఆరోపించారు. బండి సంజయ్ అరెస్ట్ దుర్మార్గపు చర్య అని, సీఎం కేసీఆర్ కి తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తారన్నారు.
బిఆర్ఎస్ నాయకులకు ఆత్మగౌరవం లేదని, కొందరు సీఎం కేసీఆర్ కాళ్ల కింద తమ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారన్నారు. ఆత్మగౌరవం కోసమే తెలంగాణ తెచ్చుకున్నామని, కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు, మంత్రులకు గౌరవం లేదని, కేవలం సీఎం కేసీఆర్, కేటీఆర్‌దే రాజ్యమన్నారు.