తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం

తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాల ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయని ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారంతో ముగిసిపోగా మూడు స్థానాలకు ముగ్గురు మాత్రమే పోటీలో ఉండటంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైంది

  • By: Somu    latest    Feb 20, 2024 10:15 AM IST
తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం

విధాత, హైదరాబాద్ : తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాల ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయని ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారంతో ముగిసిపోగా మూడు స్థానాలకు ముగ్గురు మాత్రమే పోటీలో ఉండటంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైంది. మూడు స్థానాల్లో రెండింటిలో కాంగ్రెస్ అభ్యర్థులు రేణుకా చౌదరి, అనిల్‌కుమార్ యాదవ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో స్థానానికి బీఆరెస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు సభ్యులకు రిటర్నింగ్ ఆఫీసర్ ఉపేందర్ రెడ్డి ధ్రువీకరణ పత్రం అందించారు.