రాష్ట్ర ‘ఆగ్రో’ కార్పొరేషన్ చైర్మన్‌గా తిప్పన
విధాత: తెలంగాణ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత జడ్వీటీసీ తిప్పన విజయసింహారెడ్డి నియమితులయ్యారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తన నియామక ఉత్తర్వును సీఎం చేతులమీదుగా బుధవారం ప్రగతి భవన్ లో కలిసి అందుకున్న తిప్పన విజయసింహ రెడ్డి, తనకు అవకాశమిచ్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఆయనకు సీఎం కేసీఆర్ గారు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి […]

విధాత: తెలంగాణ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత జడ్వీటీసీ తిప్పన విజయసింహారెడ్డి నియమితులయ్యారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తన నియామక ఉత్తర్వును సీఎం చేతులమీదుగా బుధవారం ప్రగతి భవన్ లో కలిసి అందుకున్న తిప్పన విజయసింహ రెడ్డి, తనకు అవకాశమిచ్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఆయనకు సీఎం కేసీఆర్ గారు శుభాకాంక్షలు తెలిపారు.
ఆయన వెంట తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ గారు, రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. అనంతరం విజయసింహా రెడ్డి మంత్రి జగదీశ్ రెడ్డి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తిప్పన నియామకంతో నల్లగొండ జిల్లాకు మరో రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి దక్కింది.