Zaheerabad | టామోటా.. దొంగల పట్టివేత

Zaheerabad | Tomato Thieves విధాత, పెరిగిన ధరలతో టామోటాల దొంగలు కూడా తయారయ్యారు. జహీరాబాద్ పట్టణంలోని కూరగాయల మార్కెట్ నుండి టామోటాల దొంగతనం చర్చనీయాంశమైంది. గుర్తు తెలియని దుండగులు దుకాణంలోకి చొరబడి 6,500విలువైన మూడు టామోటా బాక్స్ లను ఎత్తుకెళ్లారు. టామోటాల చోరిపై పోలీసులకు సదరు రైతు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.సీసీ టీవీ ఫుటేజీలలో ఓ వ్యక్తి జాకెట్, హెల్మెట్ పెట్టుకుని టామోటా ట్రేలను ఎత్తుకెళ్లడం కనిపించింది.

  • By: krs    latest    Jul 23, 2023 12:25 PM IST
Zaheerabad | టామోటా.. దొంగల పట్టివేత

Zaheerabad | Tomato Thieves

విధాత, పెరిగిన ధరలతో టామోటాల దొంగలు కూడా తయారయ్యారు. జహీరాబాద్ పట్టణంలోని కూరగాయల మార్కెట్ నుండి టామోటాల దొంగతనం చర్చనీయాంశమైంది. గుర్తు తెలియని దుండగులు దుకాణంలోకి చొరబడి 6,500విలువైన మూడు టామోటా బాక్స్ లను ఎత్తుకెళ్లారు.

టామోటాల చోరిపై పోలీసులకు సదరు రైతు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.సీసీ టీవీ ఫుటేజీలలో ఓ వ్యక్తి జాకెట్, హెల్మెట్ పెట్టుకుని టామోటా ట్రేలను ఎత్తుకెళ్లడం కనిపించింది.