టాప్-8 పెట్టుబడులు ఇవే..
విధాత: ప్రస్తుత మార్కెట్‌లో స్టాక్స్‌ను దాటి ప్రతీ ఒక్క మదుపరి తమ ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోవాల్సిన అవసరం ఉన్నది. సంపద సృష్టికి నూతన పెట్టుబడి మార్గాలను అన్వేషించే వారి ముందున్న అవకాశాల విషయానికొస్తే.. కార్పొరేట్ బాండ్లు ఏడాది-మూడేండ్ల వ్యవధిలో స్థిరమైన రాబడులను ఆశించేవారికి ఇవి చాలా అనువైనవి. ద్రవ్యోల్బణ సవాళ్లను అధిగమించడానికి వీలుగా ఉంటాయి. డిజిటల్ గోల్డ్ మార్కెట్‌లో ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్ మరింత రక్షణాత్మకంగా మారుతున్నాయి. గోల్డ్ ఈటీఎఫ్, డిజిటల్ గోల్డ్, సావరిన్ వెల్త్ […]

విధాత: ప్రస్తుత మార్కెట్‌లో స్టాక్స్‌ను దాటి ప్రతీ ఒక్క మదుపరి తమ ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోవాల్సిన అవసరం ఉన్నది. సంపద సృష్టికి నూతన పెట్టుబడి మార్గాలను అన్వేషించే వారి ముందున్న అవకాశాల విషయానికొస్తే..
కార్పొరేట్ బాండ్లు
ఏడాది-మూడేండ్ల వ్యవధిలో స్థిరమైన రాబడులను ఆశించేవారికి ఇవి చాలా అనువైనవి. ద్రవ్యోల్బణ సవాళ్లను అధిగమించడానికి వీలుగా ఉంటాయి.
డిజిటల్ గోల్డ్
మార్కెట్‌లో ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్ మరింత రక్షణాత్మకంగా మారుతున్నాయి. గోల్డ్ ఈటీఎఫ్, డిజిటల్ గోల్డ్, సావరిన్ వెల్త్ బాండ్స్ అన్నీ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.
ఫిక్స్‌డ్ డిపాజిట్లు
స్టాక్ మార్కెట్ రిస్కులకు దూరంగా సురక్షిత పెట్టుబడులను కోరుకునేవారు ఫిక్స్‌డ్ డిపాజిట్ల వైపు వెళ్లవచ్చు. వడ్డీరేట్ల పెంపు నేపథ్యంలో ఎఫ్‌డీలకు గిరాకీ పెరిగింది కూడా.
రియల్ ఎస్టేట్
దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచించేవారు రియల్ ఎస్టేట్‌ను తప్పక పరిశీలించవచ్చు. సంప్రదాయ ఇన్వెస్ట్‌మెంట్లే కాకుండా రీట్స్, ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ కూడా ఉన్నాయి.
పీర్ టు పీర్ లెండింగ్
పీర్ టు పీర్ లెండింగ్ ద్వారా 10-12 శాతం రాబడులను అందుకోవచ్చు. అయితే ఇది కాస్త రిస్కుతో కూడుకున్న ఇన్వెస్ట్‌మెంట్ అని గుర్తుంచుకోవాలి. ఇదో బ్యాంకింగ్, సంస్థాగతేతర వడ్డీ వ్యాపారం.
అసెట్ లీజింగ్
అసెట్ లీజింగ్ కూడా పెట్టుబడికి ఓ చక్కని మార్గమే. కార్పొరేట్లకు స్థిరాస్తులను లీజుకు ఇవ్వడం ద్వారా మంచి రాబడులను అందుకోవచ్చు. మార్కెటింగ్‌కు అవకాశాలున్న చోట భవనాలుంటే మరింత లాభం.
స్టార్టప్ ఈక్విటీ
ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న సంస్థల్లో పెట్టుబడులు కూడా ఇటీవలికాలంలో ట్రేండింగ్‌గా ఉంటున్నాయి. కాబట్టి కొత్త సంస్థల్లో మదుపుపై ఓ లుక్కేయండి.
ఇన్వెంటరీ ఫైనాన్స్
స్వల్పకాలిక పెట్టుబడి లక్ష్యాల సాధనకు ఇన్వెంటరీ ఫైనాన్స్‌ను ఉపయోగించుకోవచ్చు. మీ వస్తూత్పత్తుల విక్రయ విలువ ఆధారంగా ఈ ఫైనాన్స్ లభిస్తుంది.