ఒక్క సారిగా ప‌ర్యాట‌కుల పైకి పులి.. అరుపుల‌కు భ‌య‌ప‌డి

Viral Video | పెద్ద పులి గాండ్రించిందంటే అంద‌రూ పారిపోవాల్సిందే. దాని అరుపుల‌కు మ‌న గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతాయి. వెన్నులో వ‌ణుకు పుడుతుంది. కానీ ప‌ర్యాట‌కుల అరుపుల‌కు ఓ పెద్ద పులి భ‌య‌ప‌డిపోయింది. గాండ్రిస్తూ ప‌ర్యాట‌కుల‌పైకి దూసుకొచ్చిన ఆ పెద్ద‌పులి.. ప‌ర్యాట‌కులు గ‌ట్టిగా అరిచే స‌రికి.. ఎవ‌రికీ హానీ క‌లిగించ‌కుండా అడ‌విలోకి పారిపోయింది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సురేంద‌ర్ మెహ్రా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ […]

ఒక్క సారిగా ప‌ర్యాట‌కుల పైకి పులి..  అరుపుల‌కు భ‌య‌ప‌డి

Viral Video | పెద్ద పులి గాండ్రించిందంటే అంద‌రూ పారిపోవాల్సిందే. దాని అరుపుల‌కు మ‌న గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతాయి. వెన్నులో వ‌ణుకు పుడుతుంది. కానీ ప‌ర్యాట‌కుల అరుపుల‌కు ఓ పెద్ద పులి భ‌య‌ప‌డిపోయింది. గాండ్రిస్తూ ప‌ర్యాట‌కుల‌పైకి దూసుకొచ్చిన ఆ పెద్ద‌పులి.. ప‌ర్యాట‌కులు గ‌ట్టిగా అరిచే స‌రికి.. ఎవ‌రికీ హానీ క‌లిగించ‌కుండా అడ‌విలోకి పారిపోయింది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సురేంద‌ర్ మెహ్రా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

ప‌ర్యాట‌కులంతా క‌లిసి ద‌ట్ట‌మైన అడ‌విలో ఓపెన్ జీపులో స‌ఫారీకి బ‌య‌ల్దేరారు. జీపు శ‌బ్దం విన్న పెద్ద‌పులి పెద్ద‌గా అరుస్తూ చెట్ల పొద‌ల్లోంచి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప‌ర్యాట‌కుల‌పై దాడి చేసేందుకు దూసుకొచ్చిన పులి నుంచి త‌ప్పించుకునేందుకు డ్రైవ‌ర్ వాహన వేగాన్ని పెంచాడు. ప‌ర్యాట‌కులు కూడా గ‌ట్టిగా కేక‌లు వేశారు. దీంతో ఆ అరుపుల‌కు భ‌య‌ప‌డ్డ పెద్ద‌పులి తోక ముడిచింది. క్ష‌ణాల్లోనే మ‌ళ్లీ అడ‌విలోకి ప‌రుగెత్తింది పెద్ద పులి. అయితే ఈ ఘ‌ట‌న ఏ అడ‌విలో జరిగిందో మాత్రం తెలియ‌రాలేదు.