Transco CMD | రాష్ట్ర చరిత్రలో విద్యుత్ వినియోగంలో కొత్త రికార్డు
Prabhakar Rao 15062 మెగావాట్ల డిమాండ్ నమోదు విధాత: రాష్ట్ర చరిత్రలో విద్యుత్ వినియోగంలో మంగళవారం రికార్డు స్థాయిలో 15062 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదయిందని, మార్చి నెలలో అత్యధిక విద్యుత్ వినియోగం దిశగా ముందుగానే అంచనా వేశామని ట్రాన్స్ కో, జెన్ కో సీఎండి (CMD) ప్రభాకర్ రావు తెలిపారు. ఇవాళ ఉదయం 10:03 నిమిషాలకు 15062 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైందన్నారు. సాగు విస్తీర్ణం, రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలు పెరగడంతో విద్యుత్ వినియోగం […]

Prabhakar Rao
- 15062 మెగావాట్ల డిమాండ్ నమోదు
విధాత: రాష్ట్ర చరిత్రలో విద్యుత్ వినియోగంలో మంగళవారం రికార్డు స్థాయిలో 15062 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదయిందని, మార్చి నెలలో అత్యధిక విద్యుత్ వినియోగం దిశగా ముందుగానే అంచనా వేశామని ట్రాన్స్ కో, జెన్ కో సీఎండి (CMD) ప్రభాకర్ రావు తెలిపారు.
ఇవాళ ఉదయం 10:03 నిమిషాలకు 15062 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైందన్నారు. సాగు విస్తీర్ణం, రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలు పెరగడంతో విద్యుత్ వినియోగం పెరుగుతుందన్నారు. మొత్తం విద్యుత్ వినియోగంలో 37 శాతం వ్యవసాయ రంగానిదేనన్నారు.
దేశంలో వ్యవసాయ రంగంకు అత్యధిక విద్యుత్ వినియోగం చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. మొత్తం విద్యుత్ వినియోగంలో దక్షిణ భారతదేశంలో తమిళనాడు మొదటి స్థానం కాగా రెండో స్థానంలో తెలంగాణ ఉందన్నారు.
నిన్న సోమవారం విద్యుత్ వినియోగం 14,138 మెగా వాట్లు కాగా, రాష్ట్రం ఏర్పడిన తరువాత అత్యధిక విద్యుత్ డిమాండ్ 15,062 మెగా వాట్లు రికార్డ్ స్థాయిలో నమోదైనట్లు తెలిపారు. ఈ వేసవి కాలంలో 16 వేల మెగా వాట్ల డిమాండ్ వచ్చే అవకాశం ఉందన్నారు. ఎంత డిమాండ్ వచ్చిన అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామన్నారు.