రైలు కదులుతుండగా దొంగతనం.. పట్టుకున్న ప్రయాణికులు.. అలాగే 10కిమీ. ప్రయాణం (వీడియో)

విధాత:రైల్వే స్టేష‌న్లు, రైళ్లు.. దొంగ‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అని చెప్పొచ్చు. ప్ర‌యాణికుల‌ను టార్గెట్ చేసి.. దొంగ‌లు విచ్చ‌ల‌విడిగా దోపిడీలు చేస్తూ చెల‌రేగిపోతారు. చెప్పుల నుంచి మొద‌లుకొంటే.. విలువైన వ‌స్తువుల వ‌ర‌కు.. అలా ఏది దొరికితే అది దోచుకుపోతారు. అయితే ఓ ప్ర‌యాణికుడు విండో ప‌క్క‌నే కూర్చొని ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. రైలు కద‌ల‌గానే.. ఆ కిటికీలో నుంచి ప్ర‌యాణికుడి ఫోన్‌ను కొట్టేసేందుకు దొంగ య‌త్నించాడు. అప్ర‌మ‌త్త‌మైన ప్ర‌యాణికుడు.. ఆ దొంగ చేతుల‌ను గ‌ట్టిగా ప‌ట్టుకున్నాడు. మ‌రో ప్ర‌యాణికుడు కూడా […]

  • By: krs    latest    Sep 17, 2022 6:01 PM IST
రైలు కదులుతుండగా దొంగతనం.. పట్టుకున్న ప్రయాణికులు.. అలాగే 10కిమీ. ప్రయాణం (వీడియో)

విధాత:రైల్వే స్టేష‌న్లు, రైళ్లు.. దొంగ‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అని చెప్పొచ్చు. ప్ర‌యాణికుల‌ను టార్గెట్ చేసి.. దొంగ‌లు విచ్చ‌ల‌విడిగా దోపిడీలు చేస్తూ చెల‌రేగిపోతారు. చెప్పుల నుంచి మొద‌లుకొంటే.. విలువైన వ‌స్తువుల వ‌ర‌కు.. అలా ఏది దొరికితే అది దోచుకుపోతారు. అయితే ఓ ప్ర‌యాణికుడు విండో ప‌క్క‌నే కూర్చొని ఫోన్‌లో మాట్లాడుతున్నాడు.

రైలు కద‌ల‌గానే.. ఆ కిటికీలో నుంచి ప్ర‌యాణికుడి ఫోన్‌ను కొట్టేసేందుకు దొంగ య‌త్నించాడు. అప్ర‌మ‌త్త‌మైన ప్ర‌యాణికుడు.. ఆ దొంగ చేతుల‌ను గ‌ట్టిగా ప‌ట్టుకున్నాడు. మ‌రో ప్ర‌యాణికుడు కూడా అత‌నికి స‌హాయం చేశాడు. దొంగ రెండు చేతుల‌ను ఇద్ద‌రు ప్ర‌యాణికులు ప‌ట్టుకోగా.. ఆ రైలు వేగంగా 10 కిలోమీట‌ర్ల దూసుకెళ్లింది.

ఇక త‌న ప్రాణాల‌ను కాపాడుకునేందుకు ఆ దొంగ ఒకానొక ద‌శ‌లో త‌న ప‌ళ్ల‌తో కిటికీ రాడ్‌ను ప‌ట్టుకుని, కాపాడంటూ మొత్తుకున్నాడు. అయినా ప్ర‌యాణికులు క‌నిక‌రించ‌లేదు. ఈ త‌తంగాన్ని అంతా మ‌రో ప్ర‌యాణికుడు త‌న మొబైల్ ఫోన్‌లో బంధించి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశాడు.

బీహార్‌లోని సోనేపూర్ స్టేష‌న్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ స్టేష‌న్ నుంచి 10 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఖ‌న‌గ‌రియా స్టేష‌న్‌లో రైలు ఆగింది. అక్క‌డ ఆ దొంగ‌ను రైల్వే పోలీసుల‌కు అప్ప‌గించారు. అయితే దొంగ‌ను ప్రాణాల‌తో కాపాడాల‌నుకునే ఉద్దేశమే ఉంటే.. చైన్ లాగి రైలును ఆపొచ్చు క‌దా? అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. దొంగ ఒక వేళ జారి ప‌డి చ‌నిపోతే ఎవ‌రు బాధ్యులు అని అడుగుతున్నారు.