కోడిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన డా. మోదీ.. ఎందుకో తెలుసా..?

Madhya Pradesh | కోళ్లు ప్ర‌తి గ్రామంలో ఉంటాయి. గ్రామంలోని ప్ర‌తి ఇంటి వ‌ద్ద కోడి క‌నిపిస్తుంది. అలా దాదాపు ప్ర‌తి ఓ కుటుంబం కోడిని పెంచుకుంటుంది. ఇక కోళ్ల దిన్య కోడి కూత‌తో మొద‌ల‌వుతుంది. తెల్ల‌వారుజామున 4 గంట‌ల నుంచే కోళ్లు కూస్తుంటాయి. కోడి కూత కూసిందంటే తెల్లారింద‌ని భావించి ప్ర‌జ‌లు నిద్ర నుంచి లేస్తారు. అలా గ్రామంలోని ప్ర‌తి ఒక్క‌రూ కోడి కూత‌తో మేల్కొంటారు. అయితే కోడి కూత ఓ డాక్ట‌ర్‌ను ఇబ్బంది పెట్టింది. […]

కోడిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన డా. మోదీ.. ఎందుకో తెలుసా..?

Madhya Pradesh | కోళ్లు ప్ర‌తి గ్రామంలో ఉంటాయి. గ్రామంలోని ప్ర‌తి ఇంటి వ‌ద్ద కోడి క‌నిపిస్తుంది. అలా దాదాపు ప్ర‌తి ఓ కుటుంబం కోడిని పెంచుకుంటుంది. ఇక కోళ్ల దిన్య కోడి కూత‌తో మొద‌ల‌వుతుంది. తెల్ల‌వారుజామున 4 గంట‌ల నుంచే కోళ్లు కూస్తుంటాయి. కోడి కూత కూసిందంటే తెల్లారింద‌ని భావించి ప్ర‌జ‌లు నిద్ర నుంచి లేస్తారు. అలా గ్రామంలోని ప్ర‌తి ఒక్క‌రూ కోడి కూత‌తో మేల్కొంటారు. అయితే కోడి కూత ఓ డాక్ట‌ర్‌ను ఇబ్బంది పెట్టింది. తెల్ల‌వారుజామునే కోడి కూయ‌డంతో త‌న నిద్ర‌కు భంగం వాటిల్లుతుంద‌ని డాక్ట‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్ సిటీలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ప‌లాసియా ఏరియాలో డాక్ట‌ర్ అలోక్ మోదీ నివాస‌ముంటున్నారు. అయితే అత‌ను విధులు ముగించుకుని, ఇంటికి వ‌చ్చే స‌రికి బాగా రాత్రి అవుతుంది. తెల్లారిన కూడా అత‌ను నిద్ర‌లోనే ఉంటాడు. అయితే డాక్ట‌ర్ ఇంటి ప‌క్క‌నే ఉన్న ఓ ఇంట్లో కోళ్ల‌ను పెంచుకుంటున్నారు. అందులో ఓ కోడి తెల్ల‌వారుజామున 5 గంట‌ల‌కే కూస్తుంది. ఆ కోడి కూత‌తో డాక్ట‌ర్‌కు మెల‌కువ వ‌స్తుంది. దీంతో త‌న నిద్ర‌కు కోడి కూత భంగం క‌లిగిస్తుంద‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు మోదీ. ఈ ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. డాక్ట‌ర్‌తో పాటు కోడి పెంచుకుంటున్న కుటుంబాన్ని పిలిపించుకుని కౌన్సెలింగ్ ఇస్తామ‌న్నారు.