టీఆర్ఎస్ పార్టీ కొత్త విమానం.. స్పందించిన రేవంత్ రెడ్డి
విధాత, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేయబోయే జాతీయ పార్టీ కోసం టీఆర్ఎస్ తరపున సొంతగా విమానం కొనుగోలు చేస్తున్నారనే వార్తలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్వీట్టర్ వేదికగా స్పందించారు. ‘‘అమరవీరుల కుటుంబాలను కలిసింది లేదు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఏ నాడు పరామర్శించ లేదు. ప్రగతి భవన్ ఏసీ గదిని వీడింది లేదు ఫాంహౌస్ దాటింది లేదు. ఇప్పుడు దేశ దిమ్మరిలా తిరగడానికి విమానం కొంటున్నాడట! ఎవని పాలయ్యిందిరో తెలంగాణ!!’’ అంటూ […]

విధాత, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేయబోయే జాతీయ పార్టీ కోసం టీఆర్ఎస్ తరపున సొంతగా విమానం కొనుగోలు చేస్తున్నారనే వార్తలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్వీట్టర్ వేదికగా స్పందించారు.
‘‘అమరవీరుల కుటుంబాలను కలిసింది లేదు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఏ నాడు పరామర్శించ లేదు. ప్రగతి భవన్ ఏసీ గదిని వీడింది లేదు ఫాంహౌస్ దాటింది లేదు. ఇప్పుడు దేశ దిమ్మరిలా తిరగడానికి విమానం కొంటున్నాడట! ఎవని పాలయ్యిందిరో తెలంగాణ!!’’ అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో కనీస పనులు చేయని వ్యక్తి దేశదిమ్మరిలా తిరిగేందుకు వెళ్తున్నారని, అందుకు విమానం కూడా కొనుగోలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ ఏనాడు అమర వీరుల కుటుంబాలను కలిసింది లేదని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఎప్పుడూ పరామర్శించలేదని విమర్శించారు. ఆఖరికి ప్రగతి భవన్ నుంచి బయటికి రాలేదని, ఫాంహౌస్ దాటింది లేదని ఎద్దేవా చేశారు.