ఆ గుర్తులు తొలిగించండి: TRS హౌజ్ మోషన్.. నిరాకరించిన హైకోర్టు
విధాత: కారు గుర్తును పోలిన గుర్తులు తొలిగించాలని టీఆర్ఎస్ న్యాయ పోరాటానికి దిగింది. దీనిపై టీఆర్ఎస్ హైకోర్టోలో హౌజ్ మోషన్ దాఖలు చేయగా.. అత్యవసర విచారణకు ధర్మాసనం నిరాకరించింది. ఎన్నికల సంఘాన్ని టీఆర్ఎస్ ఇప్పటికే కోరిన సంగతి తెలిసిందే. దీంతో రేపు లంచ్ మోషన్లోపిటిషన్ వేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. కారు గుర్తును పోలిన గుర్తులు కెమెరా, చపాతీ రోలర్, డాలీ, రోడ్ రోలర్, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్, ఓడ గుర్తుల వల్ల ఓటర్లలో గందరగోళం […]

విధాత: కారు గుర్తును పోలిన గుర్తులు తొలిగించాలని టీఆర్ఎస్ న్యాయ పోరాటానికి దిగింది. దీనిపై టీఆర్ఎస్ హైకోర్టోలో హౌజ్ మోషన్ దాఖలు చేయగా.. అత్యవసర విచారణకు ధర్మాసనం నిరాకరించింది. ఎన్నికల సంఘాన్ని టీఆర్ఎస్ ఇప్పటికే కోరిన సంగతి తెలిసిందే. దీంతో రేపు లంచ్ మోషన్లోపిటిషన్ వేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది.
కారు గుర్తును పోలిన గుర్తులు కెమెరా, చపాతీ రోలర్, డాలీ, రోడ్ రోలర్, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్, ఓడ గుర్తుల వల్ల ఓటర్లలో గందరగోళం ఏర్పడుతున్నది. వాటిని తొలిగించాలని కోరింది. వాటిని ఎవరికీ కేటాయించవద్దని విజ్ఞప్తి చేసింది. అయితే తమ అభ్యంతరంపై ఈసీ స్పందించడం లేదని హైకోర్టును ఆశ్రయించడానికి టీఆర్ఎస్ నిర్ణయించింది.