TRS TO BRS: రేపే కీలక ఘట్టం.. కసరత్తు పూర్తి?
విధాత: టీఆర్ఎస్ పార్టీలో రేపు కీలక ఘట్టం ఆవిష్కృతం కానున్నది. ఉద్యమ పార్టీ ప్రస్థానం ప్రారంభించిన టీఆర్ఎస్ రాజకీయ పార్టీగా అవతరించి రెండు సార్లు అధికారంలోకి వచ్చి రేపు జాతీయ పార్టీగా రూపాంతరం చెందనున్నది. దానికి అనుగుణంగా టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చడంతో పాటు పార్టీ మౌలిక సిద్ధాంతాల్లో కీలక సవరణలు చేయనున్నారు. భారత రాష్ట్ర సమితి లేదా భారత రాష్ట్రీయ సమితి పేర్లు దాదాపు ఖరారయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సాధన, తెలంగాణ అభివృద్ధి వంటి అంశాల ప్రాతిపదిక […]

విధాత: టీఆర్ఎస్ పార్టీలో రేపు కీలక ఘట్టం ఆవిష్కృతం కానున్నది. ఉద్యమ పార్టీ ప్రస్థానం ప్రారంభించిన టీఆర్ఎస్ రాజకీయ పార్టీగా అవతరించి రెండు సార్లు అధికారంలోకి వచ్చి రేపు జాతీయ పార్టీగా రూపాంతరం చెందనున్నది. దానికి అనుగుణంగా టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చడంతో పాటు పార్టీ మౌలిక సిద్ధాంతాల్లో కీలక సవరణలు చేయనున్నారు. భారత రాష్ట్ర సమితి లేదా భారత రాష్ట్రీయ సమితి పేర్లు దాదాపు ఖరారయ్యాయి.
తెలంగాణ రాష్ట్ర సాధన, తెలంగాణ అభివృద్ధి వంటి అంశాల ప్రాతిపదిక టీఆర్ఎస్ ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. వాటిని జాతీయ పార్టీకి అనుగుణంగా మార్పు చేయనున్నారు. దేశమంతటా తెలంగాణ మోడల్, లౌకిక వాదం, రైతు, యువత, మహిళా సంక్షేమ వంటి అంశాలతో మౌలిక ఉద్దేశాలతో పొందు పరచనున్నట్లు సమాచారం. పార్టీ పదవుల విషయంలోనూ నిబంధనల్లో కొన్ని మార్పులను చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
జాతీయ పార్టీ ప్రకటనకు దసరా రోజు మధ్యాహ్నం 1.19ముహూర్తం ఇప్పటికే ఖరారైంది. మనుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైనప్పటికీ సమావేశ వేళల్లో ఎలాంటి మార్పు లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. నిర్దేశించిన సమయానికి తెలంగాణ భవన్‌కు రావాలని 283 మంది ప్రతినిధులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చారు.
రేపటి టీఆర్ఎస్ సమావేశానికి కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో పాటు తమిళనాడు చెందిన నాయకులు హాజరుకాన్నారని సమాచారం. ఎన్నికల సంఘం ఆమోదం తర్వాత జాతీయ స్థాయిలో అనుబంధ విభాగాలను ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే కొన్ని చిన్న పార్టీలను విలీనం చేసేందుకు కసరత్తు జరుగుతున్నది.
రేపు పార్టీ పేరు, మౌలిక సిద్ధాంతాల సవరణకు పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గం ఆమోదం తెలిపిన తర్వాత ఎల్లుండి ఎన్నికల కమిషన్‌కు నివేదించనున్నారు. ఢిల్లీ వెళ్లి ఈసీ అధికారులను కలిసి ప్రక్రియ వేగంగా జరిగేలా చూసే బాధ్యతల్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ బృందానికి అప్పగించారు. ఈసీ ఆమోద ముద్ర పడగానే బీఆర్ఎస్ నిర్మాణం ఊపందుకోనున్నది.
బీఆర్ఎస్ రైతు, యువజన, కార్మిక, విద్యార్థి విభాగాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రైతు అంశాలపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్న కేసీఆర్ దానికి అనుగుణంగా దేశంలోని వివిధ రైతు సంఘాలను బీఆర్ఎస్‌లో చేరేలా కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ఉన్న రైతు సంఘ నాయకులను ప్రగతి భవన్‌కు ఆహ్వనించారు.
వివిధ రాష్ట్రాల్లోని దాదాపు 15 రైతు సంఘాలు బీఆర్ఎస్‌కు అనుబంధంగా పని చేయనున్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతున్నది. అలాగే వివిధ రాష్ట్రాల్లోని చిన్న చిన్న పార్టీలను కూడా బీఆర్ఎస్‌లో విలీనం కానున్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. డిసెంబర్9న ఢిల్లీలో భారీ బహిరంగ సభ ద్వారా బలప్రదర్శన చేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు.
రేపు తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగే రేపటి జనరల్ బాడీ సమావేశానికి హాజరయ్యేందుకు జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ మంత్రి రేవన్న, పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకోగా ఆ బృందానికి బేగంపేట ఎయిర్ పోర్టులో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, చీఫ్ విప్ బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు స్వాగతం పలికారు.
