Truecaller | ట్రూ కాలర్‌లో కొత్త ఫీచర్.. అదేంటో తెలుసుకోండి..!

True Caller | ప్రముఖ కాలర్ ఐడెంటిటీ అప్లికేషన్ ట్రూ కాలర్ కొత్తగా ఏఐ ఫీచర్‌ను లాంచ్ చేసింది. దీంతో సెర్చ్ కాంటాక్ట్స్ నంబర్ పేరుతో ఇటీవల మారిందో లేదో తనిఖీ చేయనున్నది. సెర్చ్ కాంటాక్ట్ వినియోగదారులకు పలు రకాలుగా హెచ్చరికలు చేస్తూ కలర్ కోడెడ్ మెస్సేజ్ డిస్‌ప్లే చేస్తుంది. బ్లూ కలర్‌లో కనిపిస్తే న్యూట్రల్ ఛేంజ్‌ను సూచిస్తుంది. యెల్లో కలర్‌లో కనిపిస్తే సస్పెక్టెడ్‌గా, రెడ్ కలర్‌లో చూపిస్తే తరుచూ ఛేంజెస్ చేస్తున్నట్లుగా సూచిస్తుంది.
ఆయా రంగులను బట్టి స్కామర్స్ నంబర్స్ అయి ఉండవచ్చని అర్థం చేసుకోవచ్చు. మరో వైపు ట్రూ కాలర్ లోగోను సైతం పూర్తిగా మార్చి వేసింది. పాత లోగో బ్లూ కలర్‌లో ఉండగా.. కొత్త గోలో డయలర్ ఐకాన్ ఉన్నది. కొత్త లోగో ఇప్పటికీ బ్లూ రంగులోనే ఉన్నా.. సింపుల్ డిజైన్‌తో లోగోను మార్చి వేసింది. ఇతర డయలర్ యాప్‌ల కంటే ప్రత్యేకంగా కనిపించాలని, వినియోగదారులను గందరగోళానికి గురిచేయకుండా.. నకిలీ యాప్‌లను అరికట్టేందుకు ట్రూ కాలర్ లోగోను మార్చివేసింది. ట్రూ కాలర్ వినియోగదారులను స్కామర్ల బారిన పడకుండా సెర్చ్ కాంటెక్ట్స్‌ను ప్రారంభించింది.
సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు తమ ఫోన్ నంబర్లను మారుస్తుంటారు. ఈ క్రమంలో సెర్చ్ కాంటెక్ట్స్ వినియోగదారులను ఆయా స్కామర్ల గుర్తించడంలో సహాయపడుతుంది. ఈ సందర్భంగా ట్రూకాలర్ సీఈవో అలాన్ మామెడి మాట్లాడుతూ కొత్త లోగో కంపెనీ నిబద్ధతను, వినియోగదారులకు సాధ్యమైనంత వరకు ఉత్తమమైన అనుభవాన్ని అందించడంలో దృష్టిని ప్రతిబింబిస్తుందన్నారు. కొత్త లోగో మరింత వర్సటైల్‌గా ఉందని, వివిధ ప్లాట్‌ఫామ్‌లు, మార్కెటింగ్ మెటీరియల్స్‌లో మరింత ప్రభావవంతంగా ఉపయోగించవచ్చని ఆయన పేర్కొన్నారు.