ధరణిపై ప్రభుత్వం కీలక నిర్ణయం
ధరణి భూ వివాదాల పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలు జారీ చేసింది

- పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి మార్గదర్శకాలు జారీ
- మార్చి 1నుంచి 9వరకు తహశీల్ధార్ కార్యాలయాల వద్ద స్పెషల్ డ్రైవ్
విధాత, హైదరాబాద్ : ధరణి భూ వివాదాల పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలు జారీ చేసింది. ధరణి సమస్యల పరిష్కార అధికారాలను ప్రభుత్వం తహశీల్ధార్లు, ఆర్డీవోలకు, కలెక్టర్లకు బదలాయించింది. తహశీల్ధార్లు, ఆర్డీవోలు, జిల్లా స్థాయి అధికారులకు, సీసీఎల్‌ఏకు అధికారాలను బదలాయిస్తునట్లు మార్గదర్శకాల్లో పేర్కొంది.
ఏ స్థాయి అధికారికి ఎలాంటి అధికారాలు ఉంటాయో మార్గదర్శకాల్లో వెల్లడించింది. పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేందుకు మార్చి 1నుంచి 9వరకు తహశీల్ధార్ కార్యాలయాల వద్ద స్పేషల్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించింది. పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేసేందుకు నిర్ణీత గడువు విధించింది. తహశీల్ధార్ 7రోజుల్లో, ఆర్డీవో 3రోజుల్లో, అదనపు కలెక్టర్(రెవెన్యూ) 3రోజుల్లో, కలెక్టర్ 7రోజుల్లో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించింది.