TS Secretariat | నేడు.. కొత్త సచివాలయంలోకి శాఖల తరలింపు
TS Secretariat కేటాయింపు ప్రక్రియ దాదాపు పూర్తి చివరి దశలో ఉన్న అధికారులు, ఉద్యోగులకు సంబంధించిన కసరత్తు సీఎం కార్యాలయంతో పాటు కొన్ని అంతస్తుల్లో ఫర్నిచర్ పనులు ఇప్పటికే పూర్తి విధాత: కొత్త సచివాలయం(TS Secretariat)లోకి శాఖల తరలింపు రేపు ప్రారంభం కానున్నది. కేటాయింపు ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. అధికారులు, ఉద్యోగులకు సంబంధించిన కసరత్తు చివరి దశలో ఉన్నది. ప్రారంభోత్సవం రోజు నుంచే పూర్తిస్థాయిలో కార్యకలాపాలు సాగాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. […]

TS Secretariat
- కేటాయింపు ప్రక్రియ దాదాపు పూర్తి
- చివరి దశలో ఉన్న అధికారులు, ఉద్యోగులకు సంబంధించిన కసరత్తు
- సీఎం కార్యాలయంతో పాటు కొన్ని అంతస్తుల్లో ఫర్నిచర్ పనులు ఇప్పటికే పూర్తి
విధాత: కొత్త సచివాలయం(TS Secretariat)లోకి శాఖల తరలింపు రేపు ప్రారంభం కానున్నది. కేటాయింపు ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. అధికారులు, ఉద్యోగులకు సంబంధించిన కసరత్తు చివరి దశలో ఉన్నది. ప్రారంభోత్సవం రోజు నుంచే పూర్తిస్థాయిలో కార్యకలాపాలు సాగాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్ర నూతన పరిపాలనా సౌధం ఈ నెల 30 ప్రారంభోత్సవం కానున్నది. అధునాతనంగా, సువిశాలంగా, అధికారులు, ఉద్యోగులు ఆహ్వాదకరమైన వాతావరణంలో పనిచేసేలా కొత్త సచివాలయం భవనాన్ని నిర్మించారు. ఈ పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. భవనం ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దుకుంటున్నది. ఇంకా మిగిలి ఉన్న పనులన్నీ ఈ నెల 28 వ తేదీకల్లా పూర్తిచేయాలని గడువు నిర్దేశించారు.
ఆ తర్వాత భవనాన్ని, ప్రాంగణాన్ని ప్రారంభోత్సవానికి సిద్ధం చేయనున్నారు. సచివాలయం (TS Secretariat)లోని అన్ని అంతస్తుల్లో ఫర్నిచర్ ఏర్పాటు పనులు దాదాపు పూర్తయ్యాయి. సీఎం కార్యాలయంతో పాటు కొన్ని అంతస్తుల్లో ఫర్నిచర్ పనులు ఇప్పటికే పూర్తికాగా.. మిగతా చోట్ల కొనసాగుతున్నాయి.
ఈరోజు (సోమవారం)లోగా ఫర్నిచర్, నెట్‌వర్కింగ్ సంబంధిత పనులన్నీ పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. సచివాలయ భవనంలో కేటాయింపుల ప్రక్రియ దాదాపు పూర్తయ్యిందనే చెప్పవచ్చు. మంత్రుల వారీగా కేటాయింపు ప్రక్రియ కూడా పూర్తకావొచ్చింది.