TSLPRB | ఈ నెల 30న పోలీస్‌ కానిస్టేబుల్‌ తుది విడత పరీక్షలు

TSLPRB | తెలంగాణలో పోలీస్‌ ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగుతున్న విషయం విధితమే. పోలీస్‌ కానిస్టేబుల్‌ (Civil), పోలీస్‌ కానిస్టేబుల్(IT And CO) ఉద్యోగాల‌కు సంబంధించిన తుది రాత పరీక్షలకు సంబంధించిన తేదీలను తెలంగాణ స్టేట్ లెవ‌ల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు( TSLPRB ) ప్రకటించింది. ఏప్రిల్ 30వ తేదీన‌ రాత పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. సివిల్ ఉద్యోగాల‌కు ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు, ఐటీ అండ్ సీవో ఉద్యోగాల‌కు మ‌ధ్యాహ్నం […]

TSLPRB | ఈ నెల 30న పోలీస్‌ కానిస్టేబుల్‌ తుది విడత పరీక్షలు

TSLPRB | తెలంగాణలో పోలీస్‌ ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగుతున్న విషయం విధితమే. పోలీస్‌ కానిస్టేబుల్‌ (Civil), పోలీస్‌ కానిస్టేబుల్(IT And CO) ఉద్యోగాల‌కు సంబంధించిన తుది రాత పరీక్షలకు సంబంధించిన తేదీలను తెలంగాణ స్టేట్ లెవ‌ల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు( TSLPRB ) ప్రకటించింది. ఏప్రిల్ 30వ తేదీన‌ రాత పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొంది.

సివిల్ ఉద్యోగాల‌కు ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు, ఐటీ అండ్ సీవో ఉద్యోగాల‌కు మ‌ధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంట‌ల వ‌ర‌కు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఆయా పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లను ఈ నెల 24 ఉదయం 8 గంటల నుంచి 28 అర్ధరాత్రి 12 గంటల వరకు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలపింది. హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ సమయంలో ఏవైనా సమస్యలు ఉంటే.. వెంటనే support@tslprb.inకు మెయిల్‌ లేదంటే.. 9393711110, 9391005006 నంబర్లలో సంప్రదించాలని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ సూచించింది.