TSPSC కీలక అప్‌డేట్.. ఆన్‌లైన్‌లో AEE(సివిల్) పరీక్ష
TSPSC TSPSC AEE(సివిల్) పోస్టుల రాతపరీక్షకు సంబంధించి కీలక అప్‌డేట్ చేసింది. ఈ రాతపరీక్షలను ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మే 21,22 తేదీల్లో రెండు షిఫ్టుల్లో ఏఈఈ(సివిల్) పోస్టులకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. మే 21వ తేదీన ఏఈఈ పోస్టులకు ఓఎంఆర్ పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తామని గతంలో టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన విషయం విదితమే. 1,540 ఏఈఈ పోస్టుల భర్తీకి 2022 సెప్టెంబర్ 3న TSPSC నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు […]

TSPSC
TSPSC AEE(సివిల్) పోస్టుల రాతపరీక్షకు సంబంధించి కీలక అప్‌డేట్ చేసింది. ఈ రాతపరీక్షలను ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మే 21,22 తేదీల్లో రెండు షిఫ్టుల్లో ఏఈఈ(సివిల్) పోస్టులకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.
మే 21వ తేదీన ఏఈఈ పోస్టులకు ఓఎంఆర్ పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తామని గతంలో టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన విషయం విదితమే.
1,540 ఏఈఈ పోస్టుల భర్తీకి 2022 సెప్టెంబర్ 3న TSPSC నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు 44,352 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
TSPSC ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా ఈ ఏడాది జనవరి 22న నిర్వహించిన ఏఈఈ పరీక్షను కమిషన్ రద్దు చేసిన సంగతి తెలిసిందే.