తిరుమలలో.. ఎలక్ట్రికల్‌ బస్సు చోరీ

  • By: Somu    latest    Sep 24, 2023 10:12 AM IST
తిరుమలలో.. ఎలక్ట్రికల్‌ బస్సు చోరీ

విధాత : తిరుమల తిరుపతి దేవస్థానం ఎలక్ట్రికల్ బస్సు చోరీకి గురైంది. ఆదివారం తెల్లవారుజామున 3.30గంటలకు టోల్‌గేట్ దాటినట్లుగా గుర్తించిన అధికారులు లోకేషన్ ఆధారంగా నాయుడుపేట వద్ద ఉన్నట్లుగా గుర్తించారు. బస్సును స్వాధీనం చేసుకుని బస్సును దొంగతనానికి ప్రయత్నించిన దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

శ్రీవారి దివ్వ రథంగా భక్తులకు సేవలందించే ఎలక్ట్రిక్ బస్సు చోరీ చర్చనీయాంశమవ్వడంతో ఉరుకులు పరుగులతో బస్సును గాలించి పట్టుకున్నారు. దుండగులు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దొంగలను పట్టుకునే పనిలో ఉన్నారు. గతంలో ఒంటిమిట్ట వద్ద కూడా ఎలక్ట్రిక్ కారు మిస్ కావడం జరిగింది.