African Elephants | ఢిల్లీ: జత కోసం ఎదురుచూస్తున్న రెండు ఆఫ్రిక‌న్ ఏనుగులు

African Elephants | విధాత: భార‌త్‌లోని ఉన్న‌ రెండు ఒంట‌రి ఆఫ్రిక‌న్ ఏనుగులు త‌మ జ‌త కోసం ఎదురుచూస్తున్నాయి. దిల్లీ జూలో ఉన్న 27 ఏళ్ల శంక‌ర్‌, మైసూరు జూలో ఉన్న 20 ఏళ్ల రికీ అనే ఈ ఏనుగులు కొన్నేళ్లుగా ఒంట‌రిగా ఉంటున్నాయి. శంక‌ర్‌తో తెచ్చిన ఆడ ఏనుగు బొంబాయి 2005లో మ‌ర‌ణించ‌డంతో అది అప్ప‌టి నుంచి ఏకాంతంగానే ఉంటోంది. అలాగే రికీ తండ్రి 2016లో చ‌నిపోవ‌డంతో అదీ ఒంట‌రిగా మారింది. ప్ర‌స్తుతం దేశం మొత్తం […]

  • By: krs    latest    May 22, 2023 8:28 AM IST
African Elephants | ఢిల్లీ: జత కోసం ఎదురుచూస్తున్న రెండు ఆఫ్రిక‌న్ ఏనుగులు

African Elephants |

విధాత: భార‌త్‌లోని ఉన్న‌ రెండు ఒంట‌రి ఆఫ్రిక‌న్ ఏనుగులు త‌మ జ‌త కోసం ఎదురుచూస్తున్నాయి. దిల్లీ జూలో ఉన్న 27 ఏళ్ల శంక‌ర్‌, మైసూరు జూలో ఉన్న 20 ఏళ్ల రికీ అనే ఈ ఏనుగులు కొన్నేళ్లుగా ఒంట‌రిగా ఉంటున్నాయి. శంక‌ర్‌తో తెచ్చిన ఆడ ఏనుగు బొంబాయి 2005లో మ‌ర‌ణించ‌డంతో అది అప్ప‌టి నుంచి ఏకాంతంగానే ఉంటోంది.

అలాగే రికీ తండ్రి 2016లో చ‌నిపోవ‌డంతో అదీ ఒంట‌రిగా మారింది. ప్ర‌స్తుతం దేశం మొత్తం మీద ఆఫ్రిక‌న్ ఏనుగులు ఈ రెండే కావ‌డం గ‌మ‌నార్హం. ఏ జాతి ఏనుగు అయినా అవి మ‌నుషుల్లాగే సంఘ‌జీవులు. కాబ‌ట్టి ఇవి ఒంట‌రిగా ఉండ‌లేవని, వీటికి తోడు దొర‌క‌డం అత్య‌వ‌స‌ర‌మ‌ని వాటి సంర‌క్ష‌కులు తెలుపుతున్నారు.

అయితే శంక‌ర్‌కు తోడుగా ఆడ ఏనుగును ద‌క్షిణాఫ్రికా నుంచి తెద్దామ‌ని ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ ఎందుకో సాధ్యం కాలేదు. మ‌రోవైపు వీటిని ఇలా ఒంట‌రిగా వ‌దిలేయ‌డం జంతు హింస కింద‌కు వ‌స్తుంద‌ని, ఆ రెండింటిని ఏదైనా శాంక్చుయ‌రీలోకి వ‌దిలేయాల‌ని జంతుప్రేమికులు కోరుతున్నారు.

అయితే 20 ఏళ్ల‌కు పైగా జూలో అల‌వాటుప‌డిన ఈ ఏనుగులు అడ‌విలో కుదురుకోవ‌డం అసాధ్య‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. మిగతా ఏనుగుల గుంపుతో పోటీ ప‌డి ఇవి ఆహారాన్ని సంపాదించ‌లేవ‌న్నారు.