Virginia | అమెరికా హైస్కూల్‌లో తుపాకీ కాల్పులు, ఇద్ద‌రి మృతి

విధాత‌: అమెరికాలోని వ‌ర్జీనియా (Virginia) రాష్ట్రం రిచ్‌మండ్లోని ఓ హైస్కూల్‌లో తుపాకీ కాల్పులు క‌ల‌క‌లం సృష్టించాయి. స్కూల్ గ్రాడుయేష‌న్ పార్టీలో ఈ కాల్పులు చోటుచేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌లో 19, 36 ఏళ్ల వ‌య‌సున్న ఇద్ద‌రు మృతి చెంద‌గా.. ఐదుగురు గాయ‌ప‌డ్డారు. వీరిలో ఒక‌రి ప‌రిస్థ‌తి విష‌మంగా ఉంద‌ని పోలీసు అధికారి ఒక‌రు తెలిపారు. మ‌రో 12 మంది మాన‌సికంగా చాలా ఆందోళ‌నలో ఉన్నార‌ని వారికి త‌గిన వైద్యం అందిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. BREAKING: A mass shooting […]

Virginia | అమెరికా హైస్కూల్‌లో తుపాకీ కాల్పులు, ఇద్ద‌రి మృతి

విధాత‌: అమెరికాలోని వ‌ర్జీనియా (Virginia) రాష్ట్రం రిచ్‌మండ్లోని ఓ హైస్కూల్‌లో తుపాకీ కాల్పులు క‌ల‌క‌లం సృష్టించాయి. స్కూల్ గ్రాడుయేష‌న్ పార్టీలో ఈ కాల్పులు చోటుచేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌లో 19, 36 ఏళ్ల వ‌య‌సున్న ఇద్ద‌రు మృతి చెంద‌గా.. ఐదుగురు గాయ‌ప‌డ్డారు. వీరిలో ఒక‌రి ప‌రిస్థ‌తి విష‌మంగా ఉంద‌ని పోలీసు అధికారి ఒక‌రు తెలిపారు. మ‌రో 12 మంది మాన‌సికంగా చాలా ఆందోళ‌నలో ఉన్నార‌ని వారికి త‌గిన వైద్యం అందిస్తున్నామ‌ని వెల్ల‌డించారు.

కాగా.. ఘ‌ట‌న స‌మ‌యంలో ఒక 9 ఏళ్ల బాలిక కారులో ఇరుక్కుపోగా.. భ‌ద్ర‌తా సిబ్బంది గ‌మ‌నించి కాపాడారు. కాల్పులు జ‌రిపార‌ని భావించి తొలుత ఇద్ద‌రిని అదుపులోకి తీసుకున్న‌ప్ప‌టికీ.. అందులో ఒక‌రికి దీనితో ఏమీ సంబంధం లేద‌ని గుర్తించి విడిచిపెట్టారు. నిందితుడ్ని 19 ఏళ్ల యువ‌కుడిగా భావిస్తున్నారు.

కాల్పుల అనంత‌రం అత‌డు పారిపోడానికి ప్ర‌య‌త్నించ‌గా.. పోలీసులు నిలువ‌రించారు. ఈ క్ర‌మంలో నిందితుడికి గాయాలు అయిన‌ట్లు తెలుస్తోంది. వంద‌ల మంది గుమిగూడి ఉన్న ఈ గ్రాడ్యుయేష‌న్ పార్టీలో తుపాకీ శ‌బ్దం విన‌ప‌డ‌గానే స్వ‌ల్ప తొక్కిస‌లాట సైతం చోటుచేసుకుంది.