Marriage | మరదలిని పెళ్లి చేసుకున్న వదిన.. రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి
Marriage | ఎవరూ ఊహించని విధంగా వదిన, మరదలు కలిసి పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. సంభాల్ జిల్లా బహ్‌జోయ్‌లో నివాసం ఉండే ఓ యువతి.. తన మరదలితో కలిసి నోయిడాలోని ఓ కంపెనీలో పని చేస్తుండే వారు. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక కలిసి జీవించాలని భావించిన […]

Marriage | ఎవరూ ఊహించని విధంగా వదిన, మరదలు కలిసి పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. సంభాల్ జిల్లా బహ్‌జోయ్‌లో నివాసం ఉండే ఓ యువతి.. తన మరదలితో కలిసి నోయిడాలోని ఓ కంపెనీలో పని చేస్తుండే వారు. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక కలిసి జీవించాలని భావించిన ఆ ఇద్దరూ.. అక్కడ్నుంచి పారిపోయారు.
వదిన, మరదలు పారిపోయారని గ్రహించిన కుటుంబ సభ్యులు వారి ఆచూకీ కోసం వెతికారు. కానీ ఆచూకీ లభించలేదు. అయితే ఆదివారం ఆ ఇద్దరు బహ్‌జోయ్ పోలీసు స్టేషన్‌కు వచ్చారు. తామిద్దరం వివాహం చేసుకున్నామని, కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అయితే ఆ ఇద్దరిని పోలీసులు ఎవరింటికి వారిని పంపించారు.