Bihar | లంచం విష‌యంలో గొడవ.. న‌డిరోడ్డుపై కొట్టుకున్న‌పోలీసులు

Bihar బీహార్‌లోని న‌లంద‌లో ఘ‌ట‌న‌ సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్‌ విధాత‌: బీహార్‌లో పోలీసులు న‌డిరోడ్డుపై వీధి రౌడిల్లా కొట్టుకున్నారు. న‌లందలోని ఓ ర‌హ‌దారిపై లంచం విష‌యంలో ఒక‌రిపై మరొక‌రు దాడి చేసుకున్నారు. ఒక‌రు కాల‌ర్ ప‌ట్టుకొగా, మ‌రొక‌రు లాఠీతో అత‌డిని కొట్టేందుకు ఎగ‌బ‌డ్డాడు. జీపులోని లాఠీని తీసుకొచ్చి మ‌రీ కొట్టేందుకు య‌త్నించ‌గా మరొకరు పారి పోయాడు. Two police captured fighting in the middle of the road in #Bihar's Nalanda. #Nalanda […]

Bihar | లంచం విష‌యంలో గొడవ.. న‌డిరోడ్డుపై కొట్టుకున్న‌పోలీసులు

Bihar

  • బీహార్‌లోని న‌లంద‌లో ఘ‌ట‌న‌
  • సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్‌

విధాత‌: బీహార్‌లో పోలీసులు న‌డిరోడ్డుపై వీధి రౌడిల్లా కొట్టుకున్నారు. న‌లందలోని ఓ ర‌హ‌దారిపై లంచం విష‌యంలో ఒక‌రిపై మరొక‌రు దాడి చేసుకున్నారు. ఒక‌రు కాల‌ర్ ప‌ట్టుకొగా, మ‌రొక‌రు లాఠీతో అత‌డిని కొట్టేందుకు ఎగ‌బ‌డ్డాడు. జీపులోని లాఠీని తీసుకొచ్చి మ‌రీ కొట్టేందుకు య‌త్నించ‌గా మరొకరు పారి పోయాడు.

లంచంలో విష‌యంలో వారి మ‌ధ్య గొడ‌వ జ‌రిగిన‌ట్టు తెలుస్తున్న‌ది. నడిరోడ్డుపై ఎవ‌రినీ ప‌ట్టించుకోకుండా లాఠీతో కొట్టుకోవ‌డాన్ని రోడ్డు పై వెళ్లే వారు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు.

వీడియో కాస్త వైర‌ల్ కావ‌డంతో పోలీసులు ఉన్న‌తాధికారులు ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఆదేశించారు. సోష‌ల్ మీడియాలో పోస్టు చేసిన నాలుగు గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఐదు వేల‌మంది వీడియోను తిల‌కించారు. నెటిజ‌న్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడ‌తున్నారు.