Viral Video | ఫ్లయింగ్ కిస్సులతో రెచ్చిపోయిన ఆంటీలు..
Viral Video | నల్లటి తారు రోడ్డు.. ఆ రహదారి వెంట పచ్చని చెట్లు.. చల్లని గాలిలో తేలియాడుతూ.. ఓ మోపెడ్ బైక్‌పై ఇద్దరు మహిళలు సరదాగా వెళ్తున్నారు. అయితే ఆ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వృద్ధ మహిళ.. మోపెడ్‌ను వేగంగా నడుపుతోంది. ఆమె రైడింగ్ నచ్చిన ఓ యువకుడు వారి బైక్‌ను ఫాలో అవుతూ వీడియో చిత్రీకరించాడు. ఇంకేముంది.. ఆ ఇద్దరు మహిళలు ఎలాంటి విసుగు చెందలేదు. వారు కూడా సరదాగా దూసుకెళ్తూ.. వీడియో చిత్రీకరిస్తున్న […]

Viral Video |
నల్లటి తారు రోడ్డు.. ఆ రహదారి వెంట పచ్చని చెట్లు.. చల్లని గాలిలో తేలియాడుతూ.. ఓ మోపెడ్ బైక్‌పై ఇద్దరు మహిళలు సరదాగా వెళ్తున్నారు.
అయితే ఆ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వృద్ధ మహిళ.. మోపెడ్‌ను వేగంగా నడుపుతోంది. ఆమె రైడింగ్ నచ్చిన ఓ యువకుడు వారి బైక్‌ను ఫాలో అవుతూ వీడియో చిత్రీకరించాడు.
ఇంకేముంది.. ఆ ఇద్దరు మహిళలు ఎలాంటి విసుగు చెందలేదు. వారు కూడా సరదాగా దూసుకెళ్తూ.. వీడియో చిత్రీకరిస్తున్న యువకుడికి హాయ్ చెప్పారు. అంతే కాదు.. ఫ్లయింగ్ కిస్‌లు కూడా ఇచ్చారు.
అలా సరదాగా, సాఫీగా సాగిన మహిళల బైక్ రైడింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట్ హల్ చల్ చేస్తోంది. అయితే ఈ వీడియోను కేరళలో చిత్రీకరించారు.
ఇటీవలే ఓ ఇద్దరమ్మాయిలు బైక్ పై వెళ్తూ, హగ్‌లు, లిప్ కిస్‌లతో రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
View this post on Instagram