వద్దన్న వారే ముద్దయ్యారు.. కౌరవులే బిడ్డలయ్యారు!

సందర్భాన్ని బట్టి మాట మార్చేసిన కేసీఆర్ విధాత: నరంలేని నాలుక రకరకాలుగా మాట్లాడుతుంది.. అందులోనూ రాజకీయ నాయకుల నాలుక ఇంకా పవర్ ఫుల్..అష్ట వంకర్లు తిరుగుతుంది.. తనకు అవసరాన్ని బట్టి..సందర్భాన్ని బట్టి మాడతెస్తుంది. అప్పట్లో ఆంధ్ర ప్రజలను నాయకులను ఎన్నెన్ని మాటలన్నారు.. యెంతేసి మాటలన్నారు.. ఇప్పుడు అదే ఆంధ్రాలో పార్టీ పెట్టారు.. అదే ప్రజల మద్దతు కోరుతున్నారు. KCR ON AP pic.twitter.com/cq5Zj4jaEt — vidhaathanews (@vidhaathanews) January 4, 2023 భారత రాష్ట్ర సమితి అధినేత […]

  • By: krs    latest    Jan 04, 2023 5:05 AM IST
వద్దన్న వారే ముద్దయ్యారు.. కౌరవులే బిడ్డలయ్యారు!

సందర్భాన్ని బట్టి మాట మార్చేసిన కేసీఆర్

విధాత: నరంలేని నాలుక రకరకాలుగా మాట్లాడుతుంది.. అందులోనూ రాజకీయ నాయకుల నాలుక ఇంకా పవర్ ఫుల్..అష్ట వంకర్లు తిరుగుతుంది.. తనకు అవసరాన్ని బట్టి..సందర్భాన్ని బట్టి మాడతెస్తుంది. అప్పట్లో ఆంధ్ర ప్రజలను నాయకులను ఎన్నెన్ని మాటలన్నారు.. యెంతేసి మాటలన్నారు.. ఇప్పుడు అదే ఆంధ్రాలో పార్టీ పెట్టారు.. అదే ప్రజల మద్దతు కోరుతున్నారు.

భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అప్పట్లో ఆంధ్ర ప్రజలను కౌరవులని, మోసగాళ్లని, దగాకోర్లని ఇలా రకరకాలుగా నిందించారు. వాళ్ళను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. అసలు ఆంధ్రోళ్ల ఉనికి, వాసన సైతం తెలంగాణలో ఉండకూడదన్నారు.

ఆంధ్ర ప్రజల నాగరికత, పండుగలు, ఆహారం ఇతర వ్యవహారాల మీద ఇష్టానుసారం కామెంట్లు చేసి మొత్తం నాలుగున్నర కోట్ల మంది ప్రజలు రాక్షసులు అన్న మాదిరి ప్రజల మెదళ్లలోకి విషం ఎక్కించి తెలంగాణలో పబ్బం గడుపుకున్న కేసీఆర్‌కు ఇప్పుడు ఆంధ్ర ప్రజలు కావాల్సి వచ్చింది.

బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర శాఖను ఆంధ్రాలో ప్రారంభించి అక్కడి ప్రజల మద్దతుకోరడం అంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడి పరిస్థితి అన్నమాట. ఆనాడు తెలంగాణలో అవసరం కోసం ఆంధ్ర ప్రజలను తూలనాడిన కేసీఆర్ ఇప్పుడు అదే ప్రజలను ఆశీర్వదించాలని కోరడం గమనార్హం.

అంటే సందర్భాన్ని బట్టి ప్రధాన్యాలు మారిపోతుండడం రాజకీయ అవకాశవాదానికి పరాకాష్ట అని అంటున్నారు.. ఇక మున్ముందు ఇంకెన్ని ఎత్తులు వేస్తారో.. పదవి కోసం..రాజకీయ ప్రయోజనం కోసం ఇంకెన్ని మాటలు మారుస్తారో అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.