వాళ్లు పేకాడింది వాస్తవం: మంత్రి మల్లారెడ్డి
విధాత: ఫిర్జాదిగూడ బీఆర్ఎస్ నాయకులు పేకాట ఆడుతూ దొరికారని, వారి విషయంలో చట్టం తనపని తాను చేసుకుంటూ పోతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సి. మల్లారెడ్డి స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని ఆయన అన్నారు. ఇవాళ సచివాలయంలో ఆయన మీడియాతో మాట్టాడుతూ, రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లలో మూడేళ్ల కాలపరిమితి ముగిసిన పాలక మండలిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. నాలుగు సంవత్సరాల వరకు అవిశ్వాస తీర్మానం పెట్టకుండా ఉండేందుకు మున్సిపల్ […]

విధాత: ఫిర్జాదిగూడ బీఆర్ఎస్ నాయకులు పేకాట ఆడుతూ దొరికారని, వారి విషయంలో చట్టం తనపని తాను చేసుకుంటూ పోతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సి. మల్లారెడ్డి స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని ఆయన అన్నారు.
ఇవాళ సచివాలయంలో ఆయన మీడియాతో మాట్టాడుతూ, రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లలో మూడేళ్ల కాలపరిమితి ముగిసిన పాలక మండలిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.
నాలుగు సంవత్సరాల వరకు అవిశ్వాస తీర్మానం పెట్టకుండా ఉండేందుకు మున్సిపల్ చట్టంలో సవరణ ప్రతిపాదించామని, ఈ బిల్లుపై రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ సంతకం చేయాల్సి ఉందన్నారు. అవిశ్వాసం పై తాండూరు, వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్స్ కోర్టుకు వెళ్తే స్టే లభించిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తోందని, కార్మికులకు భద్రత కల్పించడంలో కేంద్రవ విఫలం అయ్యిందన్నారు. ఉపాధి అవకాశాలు పెరగడంతో తెలంగాణ నుంచి వలసలు ఆగిపోయాయని, ఇతర దేశాలకు వెళ్లిన వాళ్లు తిరిగి వస్తున్నారన్నా మల్లారెడ్డి వివరించారు.
దేశంలో బిజెపి ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్ ను అమ్మకానికి పెట్టిందని, లక్షల కోట్ల రూపాయల ఎఫ్.డిలు కార్మిక శాఖ దగ్గర ఉన్నాయన్నారు. ఈ నిధులను కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు.
లాభాల్లో ఉన్న పబ్లిక్ సెక్టర్ కంపెనీలను బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టిందని, హిండెన్ బర్గ్ నివేదిక బట్టబయలు కావడంతో అదానీ కంపెనీ షేర్లు ఢమాల్ అయ్యాయని అన్నారు. ఆ కంపెనీ షేర్లను కొనుగోలు చేసిన వారికి బిపి, షుగర్, హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయన్నారు. బిజెపి అంటే భారత్ జూటా పార్టీ అని మల్లారెడ్డి విమర్శించారు.