Vangaveeti with Lokesh | చాన్నాళ్లకు మళ్ళీ రాధా బయటకు వచ్చారు! లోకేష్‌తో చర్చలు..

Vangaveeti RadhaKrishna.. Discussions with Lokesh విధాత‌: రాష్ట్రంలో రాజకీయ దురదృష్టవంతుల్లో మొదటి స్థానంలో ఉండే వంగవీటి రాధాకృష్ణ(Vangaveeti RadhaKrishna) మళ్ళీ చాన్నాళ్లకు బయట కనిపించారు. రాజకీయ అవకాశాలు వెతుక్కుని వచ్చినా కాలదన్నుకుని వెళ్లిపోయే దూరదృష్టవంతుడు ఈయన.. పక్కాగా గెలిచే అవకాశాలు.. గెలిచే పార్టీలో ఉండడానికి సుతారామూ ఇష్టపడని రాధా పొలిటికల్ ప్రయాణం నిత్యం ఒడిదుడుకులు మధ్యనే సాగింది. మొత్తానికి త్వరలో జనసేన(Janasena)లో చేరతారని రూమర్లు సాగుతున్న తరుణంలో రాధా ఈరోజు పీలేరులో పాదయాత్ర చేస్తున్న లోకేష్‌ను […]

Vangaveeti with Lokesh | చాన్నాళ్లకు మళ్ళీ రాధా బయటకు వచ్చారు! లోకేష్‌తో చర్చలు..

Vangaveeti RadhaKrishna.. Discussions with Lokesh

విధాత‌: రాష్ట్రంలో రాజకీయ దురదృష్టవంతుల్లో మొదటి స్థానంలో ఉండే వంగవీటి రాధాకృష్ణ(Vangaveeti RadhaKrishna) మళ్ళీ చాన్నాళ్లకు బయట కనిపించారు. రాజకీయ అవకాశాలు వెతుక్కుని వచ్చినా కాలదన్నుకుని వెళ్లిపోయే దూరదృష్టవంతుడు ఈయన.. పక్కాగా గెలిచే అవకాశాలు.. గెలిచే పార్టీలో ఉండడానికి సుతారామూ ఇష్టపడని రాధా పొలిటికల్ ప్రయాణం నిత్యం ఒడిదుడుకులు మధ్యనే సాగింది. మొత్తానికి త్వరలో జనసేన(Janasena)లో చేరతారని రూమర్లు సాగుతున్న తరుణంలో రాధా ఈరోజు పీలేరులో పాదయాత్ర చేస్తున్న లోకేష్‌ను కలిశారు.

ఈసారైనా డ్రీమ్ నెర‌వేరేనా…

రాధాకి మొదటి నుండి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేయాలన్నది ఓ డ్రీమ్(Dream). 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సెంట్రల్ టికెట్ ఇవ్వలేదన్న కారణంతో టీడీపీ(TDP)లో చేరారు. అయితే టీడీపీలో కూడా టికెట్ రాకపోయినా అప్పట్లో పోటీచేసిన బోండా ఉమాకు ప్రచారం చేశారు. అయితే ఉమా కూడా ఓడిపోయారు. మళ్ళీ షెడ్యూల్ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. కాబట్టి సెంట్రల్ నియోజకవర్గం టికెట్ విషయమై హామీ కోసం కలిసారని అంటున్నారు. కొద్దిరోజుల క్రితం రాధా జనసేనలో చేరి సెంట్రల్ నియోజకవర్గం నుండి పోటీచేయబోతున్నారనే ప్రచారం జరిగింది.

ఉమ‌ని కాద‌ని రాధ‌కు టికెట్ ఇస్తారా..

టీడీపీ-జనసేన పొత్తులో భాగంగానే జనసేన తరపున రాధాయే సెంట్రల్లో పోటీచేస్తారనే ప్రచారం ఉంది. ఈ నేపధ్యంలోనే లోకేష్(Lokesh) పాదయాత్రలో ఉండగా రాధా కలవటం ఆసక్తికరంగా మారింది. సెంట్రల్లో ఉన్న బోండా ఉమ(Bonda Uma)ను కాదని రాధకు టికెట్ ఇస్తారా.. ఇచ్చినా జనసేన టికెట్ మీద గెలుస్తారా… ఇన్ని సందేహాలున్నాయ్.

జ‌గ‌న్ పార్టీలో ఉంటే ఏదో ఒక ప‌ద‌వి ద‌క్కేద‌ని…

రాధా 2004లో వైఎస్సార్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ నుంచి విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత ప్రజారాజ్యంలో చేరారు.. తరువాత జగన్ వెంట నడిచి టికెట్ దక్కకపోవడంతో టిడిపిలో చేరారు.. అక్కడా టికెట్ పొందలేక అటు క్యాడర్‌ను నిలుపుకోలేక ఇబ్బందుల నడుమ రాజకీయ ప్రయాణం సాగిస్తున్నారు. జగన్ పార్టీలో కొనసాగితే ఏదోటి పదవి లేదా ఎమ్మెల్సీ అయినా దక్కేదని ఆయన అభిమానులు అంటుంటారు.