Varahi Yatra | వారాహి యాత్ర‌కు బాల‌య్య‌, మ‌హేష్‌, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మ‌ద్ద‌తు

Varahi Yatra విధాత‌: జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రారంభించిన వారాహి యాత్ర‌కు ఈసారి అనూహ్యంగా ఇత‌ర స్టార్ హీరోల ఫ్యాన్స్ నుంచి మ‌ద్ద‌తు ల‌భించింది. ఆదివారం ప‌వ‌న్ క‌ళ్యాణ్ యాత్ర ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఏలూరులో ప్రారంభ‌మైంది. ఈసారి యాత్ర‌కు గ‌తంలో ఎప్పుడూ లేనంత‌గా ఇత‌ర స్టార్ హీరోల స్వాగ‌త బ్యాన‌ర్లు క‌ట్ట‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బాల‌కృష్ణ‌, ఎన్టీఆర్‌, మ‌హేష్‌బాబు ఫ్యాన్స్ వారాహి యాత్ర‌కు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు స్వాగ‌తం అంటూ ఏకంగా ఫ్లెక్సీలు, బ్యానర్లతో స్వాగతం […]

Varahi Yatra | వారాహి యాత్ర‌కు బాల‌య్య‌, మ‌హేష్‌, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మ‌ద్ద‌తు

Varahi Yatra

విధాత‌: జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రారంభించిన వారాహి యాత్ర‌కు ఈసారి అనూహ్యంగా ఇత‌ర స్టార్ హీరోల ఫ్యాన్స్ నుంచి మ‌ద్ద‌తు ల‌భించింది. ఆదివారం ప‌వ‌న్ క‌ళ్యాణ్ యాత్ర ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఏలూరులో ప్రారంభ‌మైంది.

ఈసారి యాత్ర‌కు గ‌తంలో ఎప్పుడూ లేనంత‌గా ఇత‌ర స్టార్ హీరోల స్వాగ‌త బ్యాన‌ర్లు క‌ట్ట‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బాల‌కృష్ణ‌, ఎన్టీఆర్‌, మ‌హేష్‌బాబు ఫ్యాన్స్ వారాహి యాత్ర‌కు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు స్వాగ‌తం అంటూ ఏకంగా ఫ్లెక్సీలు, బ్యానర్లతో స్వాగతం పలికాయి.

ఈ ఫ్లెక్సీలు, బ్యాన‌ర్ల‌తో ఏలూరు క‌ళ‌క‌ళ‌లాడింది. ‘వారాహి విజయ యాత్ర’ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ఫ్యాన్స్ స్వాగతం అన్న బ్యాన‌ర్లు ప‌లుచోట్ల వెలిశాయి.

‘మార్పు మొదలైంది’ అంటూ నందమూరి బాలకృష్ణ (Balakrishna) , జూనియర్ ఎన్టీఆర్ (Jr Ntr) వీరాభిమానులు, అభిమాన సంఘాలు పెద్ద ఎత్తున బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలు, బ్యానర్లపై ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.