నకిరేకల్‌లో వేముల నయా జోష్.. జాబ్ మేళతో జనంలోకి!

విధాత: నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం నియోజకవర్గం బీఆర్ఎస్ రాజకీయాల్లో మళ్లీ బిజీగా మారుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందడం, కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్‌లో చేరిన పరిణామల క్రమంలో క్రియాశీలక రాజకీయాలలో వీరేశం కొంత వెనకబడిపోయారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ లక్ష్యంగా పెట్టుకున్న వీరేశంకు సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి రూపంలో గట్టి పోటీ ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గ రాజకీయాల్లో మళ్లీ తన సత్తా చాటేందుకు, ఇటు ప్రజాదరణ […]

నకిరేకల్‌లో వేముల నయా జోష్.. జాబ్ మేళతో జనంలోకి!

విధాత: నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం నియోజకవర్గం బీఆర్ఎస్ రాజకీయాల్లో మళ్లీ బిజీగా మారుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందడం, కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్‌లో చేరిన పరిణామల క్రమంలో క్రియాశీలక రాజకీయాలలో వీరేశం కొంత వెనకబడిపోయారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ లక్ష్యంగా పెట్టుకున్న వీరేశంకు సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి రూపంలో గట్టి పోటీ ఎదురవుతుంది.

ఈ నేపథ్యంలో నియోజకవర్గ రాజకీయాల్లో మళ్లీ తన సత్తా చాటేందుకు, ఇటు ప్రజాదరణ పెంచుకు నేందుకు, అధిష్టానాన్ని మెప్పించేందుకు మళ్లీ తన కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగా ఉద్దీపన ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 80 కంపెనీలతో ఈ నెల12న నకిరేకల్ లో “మెగా జాబ్ మేళా” నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. జాబ్ మేళా ద్వారా యువతకు దగ్గరవ్వాలని వేముల భావిస్తున్నారు.

అందులో భాగంగా “మెగా జాబ్ మేళా”పోస్టర్ ను శనివారం నాడు తన క్యాంప్ కార్యాలయంలో వీరేశం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్దీపన ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు.

అందులో భాగంగానే తాను ఎంఎల్ఏ గా ఉన్నపుడు ప్రభుత్వ పాఠశాలలో వాల్లంటీర్ల ద్వారా ఆంగ్ల విద్యను అందించడం జరిగిందన్నారు. కరోనా క్లిష్టమైన సమయంలో ప్రజలకు ఫౌండేషన్ ద్వారా అనేక సేవలు అందించామన్నారు. గత నెలలో తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలకు ఉద్దీపన ద్వారా సుమారు 3 నెలలు కోచింగ్ అందించామన్నారు.

ఈ నెల 12 వ తేదీ(ఆదివారం) రోజున మెగా జాబ్ మేళాను నకిరేకల్ పట్టణంలోని హైస్కూల్ నందు నిర్వహించనున్నామని, 80కి పైగా కంపెనీలు ఇందులో పాల్గొంటాయని, ఈ అవకాశాన్ని నియోజకవర్గ నిరుద్యోగ, యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.